బయోపిక్‌ల కాలం నడుస్తోంది. ఈ సీజన్‌లో వచ్చినన్ని బయోపిక్‌లు చలన చిత్ర చరిత్ర మొత్తంలోనే రాలేదేమో..? అన్ని భాషల్లోనూ, అన్ని చోట్లా - బయోపిక్‌లకు గిరాకీ పెరిగింది. తెలుగులో అయితే ఇప్పుడు నాలుగైదు బయోపిక్‌లు సెట్స్‌పై ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో మరో బయోపిక్ చేరబోతోంది.
ఆర్తి అగర్వాల్ కథని ఇప్పుడు వెండి తెరపైకి తీసుకొస్తున్నట్టు టాక్. తెలుగులో అగ్ర హీరోలందరితోనూ నటించింది ఆర్తీ. ఓ యువ కథానాయకుడ్ని పెళ్లి చేసుకోబోతోందని వార్తలొచ్చాయి. అయితే అనూహ్యంగా ఆర్తి కెరీర్ తిరగబడింది. ఆపరేషన్ వికటించడంతో హఠాత్తుగా కన్నుమూసింది. ఇప్పుడు ఈ కథే తెరపై చూపించబోతున్నార్ట. ఆర్తి అరగ్వాల్ గా ఎవరు నటిస్తారు? దర్శకుడు ఎవరు? అనే విషయాలు త్వరలోనే బయటకు రానున్నాయి. ఈ సినిమాని అన్ని దక్షిణాది భాషల్లోనూ విడుదల చేయాలన్నది ప్లాన్.