మహానుభావుడు, ఎఫ్ 2 లాంటి సినిమాలతో ఆకట్టుకుంది మెహరీన్. తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. కమర్షియల్ సినిమాల్లో కథానాయికగా అవకాశాలు దక్కించుకుంది. హీరోయిన్ గా సెటిల్ అవుతున్న తరుణంలోనే పెళ్లికి రెడీ అయిపోయింది. భవ్య బిష్ణోయ్ తో మెహరీన్ పెళ్లి ఖాయమైంది. ఇప్పుడు నిశ్చితార్థం కూడా అయిపోయింది. జైపూర్ లో మెహ్రీన్ నిశ్చితార్థం గప్ చుప్ గా జరిగిపోయింది.
ఈ కార్యక్రమానికి మెహరీన్ కుటుంబానికి చెందిన అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి కూడా జైపూర్ లోనే జరుగుతుంది. డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. అయితే ఇప్పటికే కొంతమంది టాలీవుడ్ సెలబ్రెటీలకు ఆహ్వానాలు అందేశాయని టాక్. మెహరీన్ నిశ్చితార్థం ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తమన్నా- కయాని ప్రియదర్శన్- రాహుల్ వైద్య తదితరులు ఈ జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు.