శర్వానంద్ కథానాయకుడిగా నటించిన చిత్రం శ్రీకారం. మహా శివరాత్రి సందర్భంగా గురువారం విడుదలైంది. రైతుల సమస్యల చుట్టూ తిరిగే కథ ఇది. రైతు గొప్పదనం ఆవిష్కరించిన సినిమా ఇది. ప్రేక్షకులూ.. ఈ చిత్రానికి పట్టం కడుతున్నారు. తొలి రోజు ఈ సినిమాకి ఆశాజనకమైన వసూళ్లు లభించాయి. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ. దాదాపుగా 4 కోట్లు వసూలు చేసింది. శర్వానంద్ కెరీర్‌లో ఓ సినిమా తొలిరోజు 4 కోట్లు సంపాదించడం ఇదే తొలిసారి.
నైజాంలో అత్యధికంగా కోటి రూపాయల వసూళ్లు తెచ్చుకుంది శ్రీకారం. సీడెడ్ లో 74 లక్షలు వచ్చాయి. గుంటూరులో 65 లక్షలు, ఈస్ట్, వెస్ట్ కలిసి 68 లక్షలు, కృష్ణాలో 23 లక్షలు వచ్చాయి. ఇవి మంచి వసూళ్లే. శుక్ర, శని, ఆదివారాలూ ఇదే జోరు చూపించే అవకాశం ఉంది. ఎలా చూసినా.. తొలి నాలుగు రోజుల్లో.. బయ్యర్లకు పెట్టుబడి తిరిగొచ్చే ఛాన్సుంది. వరుసగా మూడు ఫ్లాపుల తరవాత శర్వాకి ఇది ఊరట ఇచ్చే విజయమే అనుకోవాలి.