జాతీయ అవార్డుని తన ఖాతాలో వేసుకుని అటు నటనతో పాటు ఇటు గ్లామర్ ని సైతం సరిసమానంగా తన కెరీర్ ని ప్లాన్ చేసుకున్న నటి ప్రియమణి.
అలాంటి ప్రియమణి తన వివాహం అనంతరం సినిమాలు బాగా తగ్గించేసింది అనే చెప్పాలి. ఆ తరువాత రియాలిటీ షోలకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ వస్తున్నది. అయితే ఇప్పుడు ఆమె ఆ రియాలిటీ షోలకి కూడా బ్రేక్ ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది.
దీనికి ముఖ్య కారణం ఏంటంటే- ప్రియమణి తల్లి కాబోతుండడమేనట! ఈ వార్తకి బలం చేకూర్చే విధంగా ప్రియమణి కూడా తన సోషల్ మీడియాలో కొన్ని పోస్టింగులు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ప్రియమణి నుండి రావాల్సి ఉంది.
ఒకవేళ ఈ వార్త గనుక నిజమైతే, తల్లి కానున్న ప్రియమణికి మా www.iQlikmovies.com తరపున శుభాకాంక్షలు.