ఓటీటీ ప్రధాన వినోద వేదికగా మారుతోంది. క్రమంగా ఓటీటీకి ప్రేక్షకులు అలవాటు పడుతున్నారు. స్టార్లు సైతం ఓటీటీ కోసం పని చేయడానికి రెడీ అవుతున్నారు. వెబ్ సిరీస్‌లలో స్టార్ హవా మరింతగా పెరుగుతోంది. వెటరన్ హీరోయిన్లు సైతం ఓటీటీనే నమ్ముకుంటున్నారు.
మాజీ హీరోయిన్ రాశీ ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ లో కనిపించబోతోంది. ఈ వెబ్ సిరీస్‌కి రాశీ భర్త శ్రీముని దర్శకత్వం వహిస్తారు. నిర్మాత కూడా రాశీనే. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తారు. రాశీతో పాటు తెలుగు, తమిళ చిత్రసీమకు చెందిన ప్రముఖ నటీనటులు ఈ వెబ్ సిరీస్ లో కనిపించబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ తో పాటు రెండు తెలుగు సినిమాల్ని ఒప్పుకుంది రాశీ. అవి రెండూ పెద్ద సినిమాలే. వాటి వివరాలు త్వరలోనే ప్రకటిస్తా అంటోంది.
ALSO SEE :
Raasi Latest Photoshoot