శిల్పా కూడా కాదంది... మ‌రి ఎవ‌రు చేస్తారు?

మరిన్ని వార్తలు

బాలీవుడ్ లో ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం `అంధాధూన్‌`. దీన్ని తెలుగులో నితిన్ రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈచిత్రంలో ఓ కీల‌క పాత్ర ఉంది. దాని కోసం ఓ స్టార్ ఇమేజ్ ఉన్న న‌టి కావాలి. అందుకోసం చిత్ర‌బృందం ముమ్మ‌రంగా గాలిస్తోంది. వ్యాంప్ ల‌క్ష‌ణాలున్న పాత్ర అది. హిందీలో ట‌బు చేసింది. త‌న‌కు మంచి పేరు కూడా వ‌చ్చింది. ఆ పాత్ర కోసం స‌రైన ప్ర‌త్యామ్నాయం దొర‌క‌డం లేదు. ట‌బునే అడిగితే `చేసిన పాత్ర మ‌ళ్లీ చేయ‌ను` అంద‌ట‌.

 

జ్యోతిక‌, ఇలియానా, ర‌మ్య‌కృష్ణ ఇలా చాలా పేర్లు ప‌రిశీలించిన త‌ర‌వాత‌... శిల్పా శెట్టిని ఎంచుకున్నారు. ముందు శిల్పాశెట్టి ఈ సినిమాలో న‌టించ‌డానికి ఒప్పుకున్నా, ఇప్పుడు మాత్రం నో చెబుతోంద‌ట‌. దాంతో చిత్ర‌బృందం ఇర‌కాటంలో ప‌డింది. పైగా శిల్ప రెమ్యున‌రేష‌న్ కూడా భారీగానే ఉంది. నితిన్ పారితోషికానికి దాదాపు ద‌గ్గ‌ర గా అడుగుతోంద‌ట‌. ఈ పరిస్థితుల్లో శిల్ప‌ని ఎంచుకోవ‌డం క‌రెక్ట్ కాద‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. మ‌రి... ఆ స్థానంలోకి ఎవ‌రు వ‌స్తారో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS