ఒకే ఒక్క ఛాన్స్‌.. అది అప్పుడు, అబ్బబ్బబ్బా.. ఇది ఇప్పుడు.!

మరిన్ని వార్తలు

గ్లామర్‌ తారగా ఒకప్పుడు పలువురు హీరోల సరసన ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేసింది అందాల భామ సంగీత. పదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. మహేష్‌బాబు సినిమాతో మళ్లీ సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసింది. 'ఒక్క ఛాన్స్‌, ఒకే ఒక్క ఛాన్స్‌..' అంటూ క్యూట్‌గా 'ఖడ్గం' సినిమాలో సింగిల్‌ డైలాగ్‌తో యువత హృదయాల్ని కొల్లగొట్టేసింది. ఇప్పుడు 'అబ్బబ్బబ్బా..' అంటూ ఫ్యామిలీ ఆడియన్స్‌ అందరి హృదయాల్నీ కొల్లగొట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఈ పాత్ర సంగీత చెంతకు ఎలా వచ్చిందంటే, నిజానికి తన పాత్ర గురించి అనిల్‌ రావిపూడి పూర్తిగా చెప్పలేదట. పూర్తిగా నెరేట్‌ చేస్తే సంగీత ఒప్పుకోదనే నమ్మకంతో సగమే నెరేట్‌ చేశాడట. ముఖ్యంగా 'అబ్బబ్బబ్బా..' డైలాగ్‌ గురించి అయితే అస్సలు చెప్పలేదట. తనకు నెరేట్‌ చేసిన పాత్రకూ, తాను పోషించిన పాత్రకూ అస్సలు సంబంధం లేదనీ, అనిల్‌ రావిపూడిపై సరదాగా గుస్సా అవుతోంది సంగీత.

 

తొలి డైలాగే 'అబ్బబ్బబ్బా..' అంటే ఇదేంటీ.? చాలా నాటుగా ఉంది కదా.. నాకు చెప్పింది వేరే కదా.. అని ఆశ్చర్యపోయిందట సంగీత. కానీ, మహేష్‌ సినిమా, స్టోరీ నచ్చి కంటిన్యూ చేసేసిందట. అనిల్‌ రావిపూడి సినిమాల్లో ఆడవాళ్ల పాత్రల్ని హైలైట్‌ చేస్తుంటాడు. అలాగే సంగీత పాత్ర కూడా సినిమాకి హైలైట్‌ అవుతుందని చెబుతోంది. సినిమాలో అందరూ ఎవరికి వారే తక్కువ కాకుండా నటించారు. అనుభవం, వయసుతో సంబంధం లేకుండా పర్‌ఫామ్‌ చేశారు అని విజయ శాంతి చెప్పుకొచ్చారు. సంక్రాంతి సందర్భంగా ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మికా హీరోయిన్‌గా నటించింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS