బన్నీతో ‘పరుగు’ సినిమాలో నటించిన ముద్దుగుమ్మ షీలా కౌర్ గుర్తుంది కదా. అంతకు ముందే ‘రాజుభాయ్’ తదితర చిత్రాల్లో నటించినా, బన్నీతో నటించిన ‘పరుగు’ ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో ‘అదుర్స్’, రామ్‌తో ‘మస్కా’ తదితర సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ‘పరమవీర చక్ర’ సినిమాలో బాలయ్యతోనూ జత కట్టింది. ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు ఈ బ్యూటీ. కట్ చేస్తే ఈ అందాల భామ పెళ్లి చేసుకుందని తెలిసింది. లేటెస్ట్‌గా తన పెళ్లి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, షీలా కౌర్ ఫ్యాన్స్‌ని పలకరించింది. చెన్నైకి చెందిన ఓ బిజినెస్‌మేన్‌ని షీలా కౌర్ వివాహం చేసుకుంది.
బిజినెస్‌మేన్‌ని షీలా కౌర్ వివాహం చేసుకుంది. తన భర్తతో కలిసి పెళ్లి దుస్తుల్లో నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్న ఫోటోని పోస్ట్ చేస్తూ.. ‘మేమిద్దరం కలిసి కొత్త జీవితం ఆరంభిస్తున్నాం. ఇది మాకు ఎంతో సంతోషం..’ అని ట్వీట్ చేసింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ తదితర భాషల్లో పలు చిత్రాల్లో షీలా కౌర్ నటించింది. కెరీర్ బాగా నడుస్తున్న తరుణంలోనే ఈ ముద్దుగుమ్మ ఎందుకో సినిమాల నుండి తప్పుకుంది. మరి, పెళ్లి తర్వాత ఏమైనా నటించే అవకాశాున్నాయో లేదో తెలీదు కానీ, షీలా ట్వీట్‌ని బట్టి, పర్సనల్ లైఫ్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేలా కనిపిస్తోంది.