2024 శ్రీలీలకి పెద్దగా కలిసి రాలేదు. ఇయర్ స్టార్టింగ్ లోనే గుంటూరు కారంతో డిజాస్టర్ అందుకుంది. తరవాత శ్రీలీల నుంచి మరొక సినిమా రాలేదు. కానీ ఇయర్ ఎండింగ్ లో పుష్ప 2 లో 'కిస్సిక్' పాటతో ఫుల్ ఫామ్ లోకి వచ్చింది. ఒక్క పాట శ్రీలీల కెరియర్ ని సెట్ చేసింది. దీనితో వరుస ఆఫర్స్ తో మళ్ళీ బిజీగా మారిపోయింది శ్రీలీల. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస ఛాన్స్ లతో లక్కీ చామ్ గా మారిపోయింది. ప్రజంట్ తెలుగులో అరడజను సినిమాలకి పైగా తన చేతిలో ఉన్నాయి. నితిన్, సిద్దు జొన్నల గడ్డ, నవీన్ పోలిశెట్టి, రవి తేజ, నాగ చైతన్య, అఖిల్ వీరితో సినిమాలు కమిట్ అయ్యింది.
కోలీవుడ్ లో 'శివ కార్తికేయన్' సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. వీటి తోపాటు బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్స్ వస్తున్నాయి శ్రీలీలకి. ఇప్పటికే సైఫ్ ఆలీఖాన్ వారసుడు ఇబ్రహీం ఆలీఖాన్ తో ఒక సినిమా కమిట్ అయ్యింది. ఇవి కాక చాలా ఆఫర్స్ వస్తున్నాయని టాక్. పుష్ప 2 లో శ్రీలీల చేసిన ఐటెం సాంగ్ తో బాలీవుడ్ లో కూడా పాపులారిటీ పెంచుకుంది. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ శ్రీలీలని కాంటాక్ట్ చేస్తున్నారట. ఇప్పుడు కూడా ఓ భారీ ఆఫర్ కొట్టేసింది శ్రీలీల.
అది కూడా ఫుల్ ఫామ్ లో ఉన్న కార్తీక్ ఆర్యన్ తో నటించే ఛాన్స్. కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం 'తు మేరీ మై తేరా.. మై తేరా తు మేరీ' సినిమా చేస్తున్నాడు. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో సమీర్ విద్వాన్స్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీతోనే శ్రీలీల బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ లో ఒకటైన బడా ప్రొడక్షన్ సంస్థలో నటించే ఛాన్స్ రావటంతో అమ్మడి లక్ మారినట్టే అని అంతా భావిస్తున్నారు. ఈ మూవీ హిట్ అయితే శ్రీలీల బాలీవుడ్ లో బిజీ అవటం ఖాయం.