ఒకప్పటి గ్లామర్ తార వాణీ విశ్వనాథ్ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోందా?? అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ఘరానా మొగుడు, కొదమసింహాం లాంటి సినిమాలతో తన గ్లామర్‌తో ఆకట్టుకొంది వాణీ విశ్వనాథ్. ఆ తరవాత కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల్నీ చేసింది. అయితే... చాలా కాలం నుంచీ వాణీ టాలీవుడ్‌లో కనిపించడం లేదు. ఏ సౌత్ సినిమా స్క్రీన్‌పైనా మెరవలేదు. అలాంటి వాణీ విశ్వనాథ్‌కి.. టాలీవుడ్‌లో ఇప్పుడో ఛాన్స్ దొరికినట్టు టాక్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లం కొండ శ్రీనివాస్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో వాణీ విశ్వనాథ్‌కి ఓ కీరోల్ దక్కినట్టు తెలుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మరి వాణీ విశ్వనాథ్‌కి ఎలాంటి పాత్ర దక్కిందో, అందులో ఏ స్థాయిలో విజృంభించిందో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.