మహేష్‌ సినిమాలో విజయశాంతి పాత్రేంటో తెలుసా?

By iQlikMovies - June 24, 2019 - 10:00 AM IST

మరిన్ని వార్తలు

చాలా గ్యాప్‌ తర్వాత లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. అదీ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు సినిమాతో. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేష్‌ బాబు హీరోగా రూపొందుతోన్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, విజయశాంతి ఈ సినిమాలో మహేష్‌కి తల్లిగా నటిస్తుందనీ, లేదు అత్త పాత్రనీ నెగిటివ్‌ షేడ్స్‌ ఉంటాయనీ ప్రచారం జరిగింది. కానీ, అవేమీ నిజం కావట. సినిమాకి కీలక పాత్ర కానీ, మహేష్‌తో రిలేషన్‌ ఉన్న పాత్ర కాదనీ విజయశాంతి తాజాగా చెప్పారు.

 

తల్లి కాక, అత్త కాక రిలేషన్‌ లేక ఏమై ఉంటుందో విజయశాంతి పాత్ర అంటూ ఆడియన్స్‌లో క్యూరియాసిటీ తలెత్తుతోంది. స్టోరీ ఏంటనే విషయంపై క్లారిటీ లేదు కాబట్టి, ఇక విజయశాంతి పాత్రను అంచనా కూడా వేయలేం. అంచనాలకు అందకుండానే ఆమె పాత్ర ఉండబోతోందట. ఏది ఏమైతేనేం, నెగిటివ్‌ రోల్‌ కాదని మాత్రం తేలిపోయింది. అంతేకాదు, ఫ్యూచర్‌లో కూడా నెగిటివ్‌ రోల్స్‌ జోలికి పోనని విజయశాంతి కన్‌ఫామ్‌ చేసేశారు.టీ సినిమాలో రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS