ఫ్రంట్ నుండి చూస్తే బ్లూ కలర్ డ్రస్సులో భలే మెరిసిపోతోంది కదా ముద్దుగుమ్మ ఆదాశర్మ. డిఫరెంట్ పేటర్న్ డిజైన్‌తో ఇన్నోవేటివ్‌గా ఉంది ఈ కాస్ట్యూమ్. అలాగే బ్యాక్‌కి వెళ్తే అయ్యో ఫ్రంట్ ఇంత ఖర్చుపెట్టి, బ్యాక్ ఏంటి అంతా వదిలేసిందనిపిస్తోంది కదా. అదే ఆదా శర్మ స్పెషాలిటీ. ఏదో జమ్మిక్ చేస్తుంది. అలాంటి జిమిక్కే ఇదిగో ఈ కాస్ట్యూమ్లోనూ చూపించింది. తన ప్రత్యేకతను చాటుకుంది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్‌తో కలిపి ఈ కాస్ట్యూమ్‌లో ఆదాశర్మని చూస్తుంటే క్రేజీగా అనిపిస్తోంది కదూ. 'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ 'క్షణం' తదితర చిత్రాలతో సోలో హీరోయిన్గా విజయాలు అందుకోగా, సెకండ్ హీరోయిన్గా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తమిళంలో బిజీగా గడుపుతోంది. తమిళంలో ఆదా చేతిలో రెండు మూడు చిత్రాలున్నాయి. అందులో ఒకటి ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవాతో కలిసి నటిస్తున్న 'చార్లిచాప్లిన్ 2' ఒకటి.