దుస్తులు వాడకంలో చాలా ఆదా చేస్తున్నారు మన ముద్దుగుమ్మలు. కాస్ట్యూమ్ డిజైనర్స్‌కి పెద్దగా కాస్ట్ కానివ్వకుండా చేస్తున్నారు. క్యూట్ బ్యూటీ ఆదాశర్మ తన పేరులోనే కాదండోయ్. కాస్ట్యూమ్స్‌లో కూడా చాలా ఆదా చేస్తుంది. చిట్టి పొట్టి డ్రస్సులతో తన హాట్నెస్ ప్రదర్శిస్తూ కుర్రకారుకు గుండె జారి గల్లంతయ్యేలా చేస్తుంటుంది. హాటెనెస్ సంగతి పక్కన పెడితే, అమ్మడు యోగాలో కూడా టాప్ ప్లేస్. తన శరీరాన్ని ఎలా కావాలంటే అలా వంచేస్తూ ఫీట్స్ చేస్తుంటుంది. అయితే ఈ సారి కొంచెం కొత్తగా ట్రై చేసింది. ఈ తాజా ఫోటో చూస్తే ఇదేదో సినిమా షూటింగ్‌లోని ఫోటో అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే, ఫోటో షూట్స్‌లో డిఫరెంట్‌గా ఆలోచిస్తూంటుంది ఎప్పుడూ ఆదాశర్మ. అందుకే ఈసారి ఇదిగో ఇలా ఇంత కొత్తగా ఆలోచించింది మరి. నడిచే బోట్లో బికినీతో ఇచ్చిన ఈ పోజు చూస్తే, యంగేజ్‌లో కూడా హార్ట్ ఎటాక్‌కి గురి కాక తప్పదు మరి. అందుకే ఆదా చూపిస్తోన్న ఈ రెడ్ హాట్ బికినీ అందాల్ని కాస్త గుండె అదిమి పట్టుకుని చూడండే.