ఇట్స్‌ నాట్‌ 'లై': హిట్‌ కొట్టేలానే ఉంది

By iQlikMovies - April 04, 2018 - 19:00 PM IST

మరిన్ని వార్తలు

నితిన్‌ - మేఘా ఆకాష్‌ జంటగా నటించిన చిత్రం 'ఛల్‌ మోహన్‌రంగా'. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలు వేగవంతం చేసింది. ప్రమోషన్స్‌లో హీరో నితిన్‌తో పాటు, మేఘా ఆకాష్‌ కూడా చాలా యాక్టివ్‌గా పాల్గొంటోంది. నితిన్‌తో తొలిసారి జత కట్టిన ఈ ముద్దుగుమ్మ తొలి చిత్రం 'లై' నిరాశ పరిచింది. 

కానీ ఈ సారి అలా కాదు, ఈ బ్యూటీ హిట్‌ కొట్టేలాగే ఉంది. ప్రచార చిత్రాలు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి. ప్రోమోస్‌లో మేఘా ఆకాష్‌ డిఫరెంట్‌గా ఎట్రాక్ట్‌ చేస్తోన్న మాట వాస్తవమే. అంతేకాదు, ప్రమోషన్స్‌లో ఈ ముద్దుగుమ్మ అత్యుత్సాహం చూస్తుంటే, సినిమా విజయంపై చాలా నమ్మకంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు, త్రివిక్రమ్‌ ఈ సినిమాకి కథనందించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్‌ సినిమాల్లో కథానాయికలకు స్పెషల్‌ ఇంపార్టెన్స్‌ ఉంటుంది. అలాగే ఈ సినిమాలో మేఘా క్యారెక్టర్‌కి కూడా ఎక్కువ స్కోప్‌ ఉండనుందనీ టాక్‌ వినిపిస్తోంది. ఆ లెక్కల్లో ఈ ముద్దుగుమ్మకి 'ఛల్‌ మోహన్‌రంగా' చిత్రం కలిసొచ్చేలానే అనిపిస్తోంది. 

ప్రమోషన్స్‌లో కాలేజీ స్టూడెంట్స్‌ని ఎక్కువగా టార్గెట్‌ చేసినట్లు తెలుస్తోంది. మొన్నీ మధ్యనే విడుదలైన నాగశౌర్య నటించిన 'ఛలో' చిత్రం కూడా ఈ రకమైన ప్రమోషన్స్‌తోనే హిట్‌ కొట్టింది. అలాగే 'ఛల్‌ మోహన్‌రంగా'కి కూడా విజయం దక్కబోతోందనే అనిపిస్తోంది. ఏప్రిల్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాని పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌లో కృష్ణ చైతన్య తెరకెక్కించారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS