అందాల ఆదా స్వీట్‌ వార్నింగ్‌ అదిరింది కదా!

మరిన్ని వార్తలు

సోషల్‌ మీడియాలో ఆదాశర్మ పిచ్చ యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. స్కిన్‌ షో చేయడం, అప్పుడప్పుడూ యోగాసనాలు వేయడం ఎక్స్‌ట్రా.. ఎక్స్‌ట్రా భంగిమలతో ఎప్పటికప్పుడే ఫ్యాన్స్‌ని కిర్రాకెత్తిస్తుంటుంది ఆదాశర్మ. స్కిన్‌ షోలే కాదు, స్టైలింగ్‌లోనూ ఆదాది అందె వేసిన చేయి. ఓ మాటలో చెప్పాలంటే ఆ విషయంలో ఆదా రూటే సెపరేటు అనాలేమో. ఇక హెయిర్‌ స్టైల్స్‌ సంగతి చెప్పనే అక్కర్లేదు. నల్లని కురులను రకరకాల రంగులేసి హెయిర్‌ స్టైల్స్‌లో యూత్‌ ఐకాన్‌ అనిపించుకుంటోంది.

 

అలాంటి ఆదాశర్మ తాజాగా ఓ హెయిర్‌ స్టైల్‌ ట్రై చేసింది. ఇది కేవలం ఫోటో సెషన్‌ కోసమయితే కాదులెండి. ఆదాశర్మ సినిమాలతో పాటు, కొన్ని వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తోంది. అలా ఈ భామ నటిస్తున్న 'ది హాలీడే' వెబ్‌ సిరీస్‌ కోసం కొత్త హెయిర్‌ స్టైల్‌ ట్రై చేసింది. పర్పల్‌, పింక్‌, ఆరెంజ్‌.. ఇలా మూడు రంగుల్లో తన జుట్టును ముస్తాబు చేసింది. స్టైల్‌ అన్నాక అందరూ ఫాలో అవ్వాలి కదా. కానీ, తన ఈ స్టైల్‌ని మాత్రం ఎవ్వరూ ఫాలో అవ్వడానికి వీల్లేదంటోంది ఆదాశర్మ.

 

అలా ఎలా అంటారా.? అవునంట ఈ హెయిర్‌ స్టైల్‌పై కాపీరైట్స్‌ తనవే అంటోంది. అలా కాదని ట్రై చేస్తే భారీ మూల్యం చెల్లించాలంటూ హెచ్చరిస్తోందండీ బాబూ. ఏది ఏమైతేనేం ఆదా చేస్తున్న ఈ హడావిడి ఆ 'ది హాలీడే' వెబ్‌ సిరీస్‌కి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెట్టిందనాలేమో. మరోవైపు ఆదాశర్మ తెలుగులో నటిస్తున్న 'కల్కి' ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. విలక్షణ చిత్రం 'మేన్‌ టు మేన్‌'లో ఆదాశర్మ ప్రధాన పాత్ర పోషిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS