గ్లామ్‌షాట్‌: 'ఆదా' మగాడిగా మారినా అవ్వాల్సిందే ఫిదా!

మరిన్ని వార్తలు

ఏంటిదీ.? గ్లామర్‌ ఎక్కడా.? అనుకుంటున్నారా.? ఆ మగాడి వెనక అందమైన గ్లామరస్‌ అమ్మాయి దాగుంది మరి. ఆదాశర్మ నటిస్తున్న తాజా చిత్రంలోనిదీ లుక్‌. 'మేన్‌ టు మేన్‌' సినిమా కోసం ఆదా ఓ ప్రయోగం చేస్తున్న సంగతి తెలిసిందే. మగాడి నుండి ఆడదానిలా మారే పాత్రలో ఆదా నటిస్తోంది ఈ సినిమాలో. ఇదో సరికొత్త ప్రయోగం. ఆదాలాంటి గ్లామరస్‌ బ్యూటీస్‌ ఇలాంటి పాత్ర పోషించడమంటే ఆశ్చర్యకరమే. కానీ ప్రయోగాలంటే ఇష్టపడే ఆదాకి ఏరి కోరి ఇలాంటి ఛాన్సొస్తే వదులుకుంటుందా.? అస్సలు వదులుకోదు. ఇక చూశారుగా ఇది మగాడి లుక్‌.

 

ఇక అమ్మాయి పాత్రలో ఆదా గ్లామర్‌ గురించి అస్సలు ఊహించుకోలేమట. చాలా చాలా గ్లామరస్‌గా కనిపిస్తుందని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇప్పుడు టాలీవుడ్‌లో ఆదా నటిస్తున్న ఈ సినిమా హాట్‌ టాపిక్‌ అయ్యింది. సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ పిక్స్‌, వీడియోస్‌తో రెచ్చిపోయే ఆదాశర్మ సడెన్‌గా ఇలా మీసాలతో దర్శనమిచ్చేసరికి నెటిజన్లు కాస్త షాక్‌ అయినా, ఈ సరికొత్త గెటప్‌కి కూడా ట్రెమండస్‌ రెస్పాన్సే వస్తోంది. అబ్జర్వ్‌ చేస్తే, ఇక్కడ కూడా ఆదా గ్లామర్‌ని మిస్‌ చేయలేదు కదా. కీప్‌ ఇట్‌ అప్‌ ఆదా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS