కేసులివ్వండి ప్లీజ్‌ అంటోన్న సందీప్‌కిషన్‌!

By iQlikMovies - May 07, 2019 - 17:30 PM IST

మరిన్ని వార్తలు

ఆగండి కంగారు పడకండీ. మనోడు అడుగుతోంది వేరే కేసులు కాదండోయ్‌. మీరేం డబుల్‌ మీనింగులు తీయకండి పాపం. అసలే మనోడి పరిస్థితి ఏమీ బాగాలేదు. పేరుకు లాయర్‌. కానీ, వాదించేందుకు కేసుల్లేక బేజార్‌. అందుకే కేసులిచ్చి ఈ చెట్టుకింది ప్లీడర్‌ని ఆదుకోండి ప్లీజ్‌ అంటూ చేతులెత్తి అభ్యర్ధిస్తున్నాడు. అయితే మరీ చెట్టుకింది ప్లీడరేం కాదులెండి. చక్కగా ఓ ఆఫీస్‌, ఆఫీస్‌లో ఓ టేబుల్‌, టేబుల్‌పై కాళ్లు కూడా పెట్టుకోవచ్చు. టేబుల్‌ నిండా ఫైళ్లు బాగానే ఉన్నాయి మరి. అయితే అవేమీ చిల్లర రాలే ఫైళ్లు కాదు కాబోలు.

 

అబ్బబ్బా.. ఈ లొల్లి ఏంటంనుకుంటున్నారా? సందీప్‌కిషన్‌ నటిస్తున్న 'తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.ఎల్‌' అనే సినిమాకి సంబంధించిందే ఈ లొల్లి అంతా. ఈ రోజు సందీప్‌ కిషన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేస్తూ, సందీప్‌కి బర్త్‌డే విషెస్‌ తెలిపింది చిత్ర యూనిట్‌. ఈ ఫస్ట్‌లుక్‌ సో ఫన్నీగా ఉంది. అలాంటప్పుడు కాస్త ఇలా చెప్పుకోవాలి కదా.. ఇకపోతే మనోడు ఇంకో సినిమాలో కూడా నటిస్తున్నాడండోయ్‌. అది చెప్పాలంటే మాత్రం భయమవుతోంది. ఎందుకంటే అబ్బో అది హారర్‌ మూవీయండీ బాబూ. సినిమా పేరు 'నిను వీడని నీడను నేనే'. అప్పుడెప్పుడో 'ఓ స్త్రీ రేపురా' సినిమా కాబోలు.. ఆ సినిమాలో ఓ పాట ఈ సౌండింగ్‌తో రన్‌ అవుతూ ఉంటుంది. దెయ్యం సినిమా అంటే చాలు మనకి ఇదే పాట గుర్తొచేస్తుంటుంది.

 

అలాంటిది ఏకంగా మనోడు ఈ సౌండ్‌నే టైటిల్‌గా పెట్టేసుకున్నాడు. పుట్టినరోజు సందర్భంగా సందీప్‌కిషన్‌కి ఈ సినిమా టీమ్‌ కూడా టీజర్‌ రిలీజ్‌ చేసి, స్పెషల్‌గా విష్‌ చేశారు మనోడ్ని. విషెస్‌ బాగానే ఉన్నాయి కానీ, మనల్నే కాస్త భయపెట్టేశాడు సందీప్‌ కిషన్‌. ఓ పక్క నవ్విస్తానంటున్నాడు. ఇంకో పక్క భయపెడతానంటున్నారు. కామెడీ, హారర్‌.. పుట్టినరోజునాడు రెండు ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎంట్రీ ఇచ్చిన మనోడు దేంతో హిట్‌ కొడతాడో. రెండింటితోనూ మంచి సక్సెస్‌ అందుకోవాలని ఆశిస్తూ మనం కూడా సందీప్‌కి హ్యాపీ బర్త్‌డే చెప్పేద్దామా. విష్‌ యు హ్యాపీ బర్త్‌డే సందీప్‌ కిషన్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS