'స్టైల్‌లో ఆదా స్టైలే వేరయా' అని అనకుండా ఉండలేం. ఎందుకంటే, ఎప్పటికప్పుడే డిఫరెంట్ స్టైల్‌తో అందరి చూపును తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంటుంది ముద్దుగుమ్మ ఆదాశర్మ. సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు తక్కువే అయినా, సోషల్ మీడియాలో అభిమానులకు ఎప్పుడూ దగ్గరగా ఉంటుంది. డిఫరెంట్ స్టైల్స్‌ని పరిచయం చేస్తుంటుంది. రంగు రంగుల హెయిర్ మేకప్స్‌తో ఆకట్టుకుంటుంది. అలాగే విభిన్నమైన కసరత్తులు చేస్తుంటుంది. మొన్నామధ్య బికినీలో సముద్రం మధ్యన బోట్‌లో ఆదాశర్మ చేసిన హాట్ ఫీట్స్‌కి అభిమానులు అవాక్కయ్యారు. అందం, హాట్‌నెస్, గ్లామర్ ఇవే కాదు, ఫిజిక్‌లో కూడా ఆదాశర్మ టాప్ అంతే. కరెక్ట్ ఫిజిక్‌ని మెయింటైన్ చేస్తూ, కుర్రకారుకు క్రేజీయెస్ట్ గాళ్‌గా హవా చూపిస్తోంది. తాజా పిక్‌లో చూశారా. పింక్ హెయిర్‌తో టూ పీస్ కాస్ట్యూమ్‌తో అసలింతకీ ఆదా ఏం చేస్తోందీ అనేలా లేదూ ఈ పోజు. అదే ఆదా స్టైల్.