'అఖిల్' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన అక్కినేని రాకుమారుడు అఖిల్ తాజాగా 'తొలిప్రేమ' దర్శకుడు వెంకీ అట్లూరితో మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా? నిధి అగర్వాల్. అదేనండీ చైతూతో 'సవ్యసాచి' సినిమాలో నటిస్తోంది కదా ఆ ముద్దుగుమ్మే ఈ ముద్దుగుమ్మ. నిధి అగర్వాల్ 'సవ్యసాచి'తోనే టాలీవుడ్‌కి పరిచయం అవుతోంది. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈలోగా మరో సినిమాకి ఛాన్స్ కొట్టేసిందీ ముద్దుగుమ్మ. అదీ అక్కినేని కాంపౌండ్‌లోనే నెక్ట్స్ ఛాన్స్ దక్కించుకోవడం విశేషం. వరుసగా అక్కినేని అన్నదమ్ములతో జోడీ కట్టేస్తోందన్న మాట ఈ బ్యూటీ. అఖిల్ తొలి సినిమాతో సాయేషా సైగల్‌ని హీరోయిన్‌గా పరిచయం చేశాడు. రెండో సినిమాకి కళ్యాణీ ప్రియదర్శన్‌ని తీసుకొచ్చాడు. ముచ్చటగా మూడో సినిమాకి కూడా అఖిల్ కొత్త భామనే తీసుకొస్తాడనుకున్నారు. అయితే అనూహ్యంగా ఆ గోల్డెన్ ఛాన్స్ నిధి అగర్వాల్‌ని వరించింది.
త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకెళ్లనుంది. తొలి షెడ్యూల్ షూటింగ్‌ని ఇంగ్లండ్‌లో స్టార్ట్ చేయనున్నారట. 'తొలిప్రేమ' సినిమాతో మంచి విజయం అందుకున్న వెంకీ అట్లూరి ఆ సినిమాని ఇంగ్లండ్‌లోనే స్టార్ట్ చేశాడట. ఆ సెంటిమెంట్‌తోనే అఖిల్ సినిమా కూడా అక్కడే మొదలు పెట్టాలనుకుంటున్నాడట.
అవును సినిమాల్లో సెంటిమెంట్స్ కంపల్సరీ మరి. ముచ్చటగా మూడో సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా అయినా అఖిల్‌కి బ్లాక్ బస్టర్ తెచ్చిపెడుతుందేమో చూడాలి మరి. మాంచి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరెక్కిస్తున్నాడు వెంకీ అట్లూరి.