అందమైన పాలరాతి శిల్పమా.!

By iQlikMovies - August 01, 2018 - 18:08 PM IST

మరిన్ని వార్తలు

పిక్‌లో ఇంత అందంగా పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న ఆదాశర్మ ఏం చేసినా విభిన్నంగా ఉండాలనే కోరుకుంటుంది. అందులో భాగంగానే ఈ మధ్య 'కికి' ఛాలెంజ్‌ పేరు చెప్పి సోషల్‌ మీడియాలో జరుగుతున్న పైత్యం గురించి వినే ఉంటారు. 'వెళ్తున్న కార్లోంచి దిగి డాన్స్‌ చేయడమే..' ఈ 'కికి' ఛాలెంజ్‌ ప్రత్యేకత. ఈ ఛాలెంజ్‌ స్వీకరించిన ఆదాశర్మ ఈ గెటప్‌లో దర్శనమిచ్చింది. ఇదే గెటప్‌లో వెళ్తున్న కార్లోంచి దిగి స్టెప్పులేసింది. లేటెస్టుగా అందాల భామ రెజీనా కూడా ఈ ఛాలెంజ్‌ని స్వీకరించింది. అయితే ఈ ఛాలెంజ్‌ వల్ల ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయనీ, యాక్సిడెంట్స్‌ జరుగుతున్నాయనీ పోలీసులు ఆంక్షలు విధించారు. ఇకపై ఈ ఛాలెంజ్‌ ఎవరైనా స్వీకరిస్తే, వారిని అరెస్టు చేస్తామనీ పోలీసులు ప్రకటించారు. సోషల్‌ మీడియా వచ్చాక, ఇలాంటి పైత్యాలకు కొదవే లేకుండా పోతోంది. నిన్న మొన్నటి వరకూ 'ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌' అంటూ ఊగిపోయిన జనం ప్రస్తుతం ఈ కికి ఛాలెంజ్‌ మాయలో ఊయలూగుతున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS