ఇటీవల 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాతో అల్లు అర్జున్ సైనికుడి పాత్రలో కనిపించి, తనలోని భిన్న యాంగిల్‌ని పరిచయం చేశాడు. నటన పరంగా మంచి మార్కులే వేయించుకున్నా, ఎందుకో ఈ సినిమాకి టైం కలిసి రాలేదు. భారీ అంచనాల నడుమ విడుదలైనా, ఆశించిన రిజల్ట్ ఇవ్వలేకపోయింది ఈ సినిమా.
తర్వాత అల్లు అర్జున్ ఏ తరహా కాన్సెప్ట్‌ని ఎంచుకోవాలో తెలీని సందిగ్ధంలో ఉన్న తరుణంలో ఓ అదిరిపోయే కాన్సెప్ట్ అల్లు అర్జున్‌ని వెతుక్కుంటూ వచ్చిందనీ తాజా సమాచారమ్. 'సభకు నమస్కారం' అనే టైటిల్‌తో ఓ స్టోరీ లైన్ అల్లు అర్జున్ దగ్గరికి వచ్చిందట. రాజకీయాల నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమట. ఈ సినిమా పట్ల అల్లు అర్జున్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమా వివరాలపై అల్లు అర్జున్ క్లారిటీ ఇవ్వనున్నాడట.
ఇకపోతే 'సరైనోడు' సినిమా తర్వాత అల్లు అర్జున్‌కి ఆ స్థాయిలో హిట్ పడలేదు. 'డీజె'తో ఓ ప్రయోగం, 'సూర్య'తో మరో ప్రయోగం చేసి బోల్తా కొట్టాడు. మరి ఈ సారి కూడా ప్రయోగానికే సై అంటున్నట్లు కనిపిస్తోంది. కానీ రాజకీయాల నేపథ్యం ఇప్పుడు ట్రెండింగ్ అనే చెప్పాలి. 2019 ఎలక్షన్స్‌ని బేస్ చేసుకుని పలు చిత్రాలు ఇప్పుడు పోలిటిక్స్ సెంట్రిక్ మూవీస్‌గా రూపొందేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి బన్నీ రాజకీయం ఎలా ఉండబోతోందో తెలియాలంటే ఫుల్ డీటెయిల్స్ వచ్చేంత వరకూ ఆగాల్సిందే మరి.