ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు.. ఒకరిలానే ఇంకొకరు. ఒకరు ఎలాగైతే డాన్స్ చేస్తున్నారో, ఇంకొకరూ అలాగే డాన్స్ చేస్తున్నారు. సేమ్ కాస్ట్యూమ్స్, సేమ్ లిప్ సింక్, సేమ్ స్టయిలింగ్.. అబ్బో, ఆమె చాలానే ‘ఆదా’ చేసింది కదూ.! వినడానికి కామెడీగానే వున్నా ఇది అచ్చంగా నిజం. ‘హార్ట్ ఎటాక్’ ఫేం ఆదా శర్మ, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఆమెకు లక్షలాది మంది ఫాలోవర్స్ వున్నారు. ఎప్పుడూ కొత్తగా ఆలోచిస్తుంటుందామె. తాజాగా ఆమె అద్దం ముందు తనదైన స్టయిల్లో డాన్స్ చేస్తూ దర్శనమిచ్చింది. అద్దంలో చూసుకుంటే ఇద్దరేం ఖర్మ, ముగ్గురు.. నలుగురు.. ఆ మాటకొస్తే ఇంకా ఎక్కువ మంది కూడా కన్పిస్తారు ఒకేలా. ఎన్ని అద్దాలుంటే.. అన్ని ప్రతిబింబాలు కన్పిస్తాయి.
ఆ విషయం అందరికీ తెలుసు. కానీ, ఆదా శర్మ కాస్త కొత్తగా ఆలోచించింది. అద్దంలో ప్రతిబింబం కాన్సెప్ట్‌ని బేస్ చేసుకుని కొద్ది సెకెన్ల నిడివిగల డాన్స్ వీడియో రూపొందించింది. తన డాన్స్‌కి అదనంగా రబ్బరులా వంగే తన శరీరం ప్రధాన ఆకర్షణ ఆదా శర్మకి. పొట్టి నిక్కరు.. గల్ల చొక్కా.. వెరసి, ఆదా శర్మ వేసిన డాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘సోషల్ డిస్టెన్సింగ్’కి సరికొత్త అర్థం చెప్పిందామె. ఓ వైపు సోషల్ మెసేజ్, ఇంకో వైపు క్రియేటివిటీ.. వీటికి మించి హాట్ అప్పీల్.. ఆదా శర్మ భలే తెలివైంది సుమీ.