తెలుగులో 'హార్ట్ ఎటాక్' సినిమాతో క్యూట్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఆదాశర్మకు తొలి సినిమా ఓకే అనిపించినా ఆ తర్వాత పెద్దగా పట్టించుకోలేదు. అందం, అభినయం అన్నీ ఉన్నాయి కానీ అదృష్టం మాత్రం అంతంత మాత్రమే. 'క్షణం' సినిమా ఆదా కెరీర్‌లో చెప్పుకోదగ్గ సక్సెస్‌నిచ్చిందని చెప్పొచ్చు.
అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆదా శర్మకు పిచ్చ పిచ్చగా క్రేజ్ ఉందిలే. అందుకు కారణం ఆమె పోస్ట్ చేసే డిఫరెంట్ అండ్ హాట్ ఫోటో షూట్సే అని చెప్పక తప్పదు. అంతేకాదు, సిట్యువేషనల్‌గా స్పందిస్తూ ఇన్‌స్పైరింగ్ పోస్ట్‌లు కూడా పెడుతూ ఉంటుంది అప్పుడప్పుడూ. ఇకపోతే తాజాగా ఆదాశర్మ ఫోటో షూట్ హాట్ టాపిక్ అయ్యింది. ఎప్పుడూ గ్లామర్‌తో వైరల్ అయ్యే ఆదాశర్మ, ఈ సారి కొంచెం కొత్తగా వైరల్ అయ్యింది. డీ గ్లామర్ లుక్‌లో ఫోటో షూట్ చేయించుకుంది. అయితే ఇది జస్ట్ ఫోటో షూట్ మాత్రమే కాదు. సినిమాలోని ఓ లుక్. అది కూడా హాలీవుడ్ మూవీ కోసం.
నిజమే. ఆదాశర్మకు ఈ మధ్య హాలీవుడ్‌కి వెళ్లే గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. అదేంటి హాలీవుడ్ మూవీ అంటే, డీ గ్లామరేంటి అనుకుంటున్నారా? ఏమో మరి, సోషల్ మీడియాలో పాత చీర కట్టుకుని, అలిసిపోయి, వాడిపోయిన ముఖంతో, కూరగాయలు అమ్ముకుంటూ కనిపిస్తున్న ఆదాశర్మ ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి. హాలీవుడ్ మూవీ స్టిల్స్ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే నిజంగా హాలీవుడ్‌లో ఈ తరహా గెటప్‌లో ఆదాశర్మ నటిస్తుందా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.
ఏది ఏమైనా ఈ గెటప్‌లో ఆదాశర్మని చూస్తూ అభిమానులు ఒకింత డిజప్పాయింట్ అవుతున్నారు. అసలింతకీ నిజంగా ఈ గెటప్ సినిమా కోసమేనా.!