ఛాలెంజింగ్‌ రోల్‌లో 'హార్ట్‌ ఎటాక్‌' బ్యూటీ.!

మరిన్ని వార్తలు

'హార్ట్‌ ఎటాక్‌'తో టాలీవుడ్‌కి పరిచయమైన అందాల భామ ఆదాశర్మ త్వరలో ఓ ప్రయోగం చేయబోతోంది. ఇంతవరకూ సోషల్‌ మీడియాలో అమ్మడి సాహసాలు మాత్రమే చూసిన నెటిజన్లు తెరపై తొలిసారి ఆమె ప్రయోగాన్ని చూడబోతున్నారు.

 

డిఫరెంట్‌ అండ్‌ క్రిటికల్‌ ఫీట్స్‌తో హాట్‌ హాట్‌ లుక్స్‌తో ఆకట్టుకునే ఆదాశర్మ త్వరలో బాలీవుడ్‌లో ఓ ట్రాన్స్‌జెండర్‌ పాత్రలో కనిపించనుంది. 'మ్యాన్‌ టు మ్యాన్‌' అనే సినిమా కోసం ఆదా ఈ ప్రయోగం చేయబోతోంది. అబ్బాయిగా పుట్టి ఆపరేషన్‌ తర్వాత అమ్మాయిగా ఎలా మారింది. అలా అమ్మాయిగా మారిన ఆమె పెళ్లి తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది..? అనేదే ఈ సినిమా కాన్సెప్ట్‌. ఫస్ట్‌టైమ్‌ పర్‌ఫామెన్స్‌కి ఇంత స్కోపున్న సినిమాలో ఆదా నటిస్తోంది. బాలీవుడ్‌ అంటేనే ప్రయోగాలకు పెట్టింది పేరు. అయితే ఇప్పుడిలాంటి ప్రయోగాలు అన్ని భాషల్లోనూ ప్రోత్సహించబడుతున్నాయిలెండి. ఇకపోతే ఆదాశర్మ నటించబోయే సినిమాలో ఈ ఇంపార్టెంట్‌ ఇష్యూకి ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు, ఇంటర్నల్‌గా ఓ మంచి సోషల్‌ మెసేజ్‌ కూడా యాడ్‌ చేశారట. దాంతో ఈ సినిమా విజయం సాధించడం పక్కా అంటున్నారు.ఆదాశర్మకి జోడీగా నవీన్‌ కస్తూరియా నటిస్తున్నాడు. అబీర్‌ సేన్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు.

 

ఇటీవల లెస్బియన్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన 'ఏక్‌ లడకీతో దేఖా తో ఐసా లగా' అనే సినిమా మంచి విజయం అందుకుంది. ఈ సినిమాలో నటించిన రెజీనాకి మంచి పేరొచ్చింది. సోనమ్‌ కపూర్‌, అనిల్‌ కపూర్‌, రాజ్‌కుమార్‌ రావ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు ఈ సినిమాలో. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS