డాడీ కూల్‌ అంటోన్న 'రొమాంటిక్‌' హీరో.!

By iQlikMovies - April 24, 2019 - 16:00 PM IST

మరిన్ని వార్తలు

'మెహబూబా'తో హీరోగా పరిణితి చెందిన ఆకాష్‌ పూరీ త్వరలో 'రొమాంటిక్‌' సినిమాతో రాబోతున్నాడు. అయితే తాజాగా ఆకాష్‌ పూరీ తన ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. ఇప్పుడీ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇంతకీ వీడియోలో ఏముందంటే, జపనీస్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నాన్‌చక్స్‌లో క్రియేటివ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌ టాలెంట్‌ దాగి ఉంది.

 

ఎక్స్‌పర్ట్‌లా పూరీ నాన్‌చక్స్‌ చేస్తున్నాడీ వీడియోలో. ఈ వీడియోని పోస్ట్‌ చేస్తూ 'నాన్‌చక్స్‌లో నాన్నను నేను ఎప్పటికీ బీట్‌ చేయలేను.. కూల్‌ డాడీ' అంటూ హ్యాష్‌ టాగ్‌ జత చేశాడు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు పూరీని ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాధ్‌ 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమా తెరకెక్కిస్తున్నాడు. రామ్‌ పోతినేని హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌లో పూరీ జగన్నాధ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరోవైపు ఆకాష్‌ పూరీ 'రొమాంటిక్‌' మూవీలో నటిస్తున్నాడు. కేతికా శర్మ ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ఈ సినిమాకి పూరీ జగన్నాధ్‌ డైరెక్టర్‌ కాదు కానీ, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ అన్నీ తానే. సో ఈ సినిమాకి కూడా ఫ్లేవర్‌ పూరీదే. రెండు సినిమాలూ సమాంతరంగా షూటింగ్‌ జరుపుకుంటున్నాయి.

 

ఇంచుమించు ఈ రెండు సినిమాల షూటింగ్‌ స్పాట్స్‌ సింక్‌ అయ్యేలా లొకేషన్స్‌ ఛూజ్‌ చేసుకుంటున్నారు. అతి తక్కువ గ్యాప్‌లోనే ఈ రెండు సినిమాలూ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS