ఆదా శర్మ.. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదూ. `ఇద్దరమ్మాయిలతో` సినిమాలో నటించి మెప్పించింది. క్షణంలాంటి మంచి హిట్ ఆదా ఖాతాలో ఉంది. అయితే.. అనుకున్నంత పేరు రాలేదు. గ్లామర్ రోల్స్ కి రెడీ అన్నా ఎవరూ పట్టించుకోలేదు. అయితే.. ఇప్పుడు ఆదా మళ్లీ స్వింగులోకి వచ్చింది. ఒకేసారి 5 సినిమాలపై సంతకాలు చేసేసింది. ఈ విషయాన్ని ఆదానే స్వయంగా ప్రకటించింది.
క్షణం విడుదలై 5 యేళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆదా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. తాను కొత్తగా 5 తెలుగు సినిమాల్లో నటిస్తున్నానని సగర్వంగా ప్రకటించింది. ఒకేసారి 5 సినిమాల్లో నటించడం నిజంగా వింతే. కాకపోతే.. ఆ సినిమాలేమిటన్నది ఇంకా చెప్పలేదు. బహుశా.. వాటి వివరాలు ఒకొక్కటిగా ఆదా ప్రకటిస్తుందేమో చూడాలి. ఈమధ్య ఓటీటీ హవా బాగా ఎక్కువైంది. వాటి కోసమే కొన్ని సినిమాలు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో కథానాయికలకు గిరాకీ పెరిగింది. అందుకే ఆదా లైన్ లోకి వచ్చుంటుంది.