సరికొత్త వర్కవుట్స్‌తో సోషల్ మీడియాని హీటెక్కించే ఆదాశర్మ కరోనా హాలీడేస్‌ని ఎలా యూజ్ చేసుకుందో చూస్తే ఆశ్చర్యపోతారు. ఎప్పుడూ బిజీ షెడ్యూల్స్‌తో ఫుల్ బిజీగా గడుపుతూ, ఇంటి సభ్యులకు టైమ్ కేటాయించలేని సెలబ్రిటీలందర్నీ కరోనా, కాలు కదపకుండా, గడప దాటనీయకుండా ఇంట్లోనే కూర్చుండబెట్టింది. ఈ టైమ్‌ని తమకు తోచిన విధంగా వాడుకుంటున్నారు మరీ ముఖ్యంగా మన ముద్దుగుమ్మలు. సరికొత్త పనులకు శ్రీకారం చుడుతున్నారు ఈ 21 రోజుల కాల పరిమితిని.
ఇక సోషల్ మీడియాకి హాట్ హాట్ టాపిక్స్‌తో కిక్కిచ్చే హాట్ బ్యూటీ ఆదాశర్మ ఏం చేసిందో తెలుసా.? వర్కవుట్సే చేసిందిలెండి. అయితే, వాటినే డిఫరెంట్ యాంగిల్‌లో చేసి చూపిస్తోంది. ఇల్లు తడి గుడ్డ పెడుతూ, డ్రెస్సింగ్ మిర్రర్‌ని క్లీన్ చేస్తూ డిఫరెంట్ యాంగిల్స్‌లో ఓ వైపు ఇంటి పనీ, మరో వైపు ఒంటి పనీ కూడా కానిచ్చేస్తోంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, బోర్ ఫీలవుతున్న నెటిజన్స్‌లో సరికొత్త ఉత్సాహం నింపింది. ఇంకెందుకాలస్యం ఆరామ్‌గా ఆదాశర్మ భంగిమల్ని తిలకించి తరించండి.