‘మజ్ను’ సినిమాతో టాలీవుడ్‌ని పకరించిన ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్. తొలి సినిమాతో మంచి హిట్ సొంతం చేసుకుంది. తర్వాత చిన్న చిన్న హీరోల సరసన నటిస్తూ, కెరీర్‌ని స్లో స్లోగా ఒక్కో మెట్టు చొప్పునా బిల్డ్ చేసుకుంటూ వచ్చింది. ఆ తరుణంలో ఒక్కసారిగా పెద్ద హీరోల కన్ను ఈ ముద్దుగుమ్మపై పడింది. వరుసగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అళ్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు తమ తమ సినిమాల్లో అనూ ఇమ్మాన్యుయేల్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. దాంతో ఇంకేముంది ఈ పాప స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లిపోయిందనుకున్నారంతా. సరె సర్లే ఎన్నెన్నో అనుకుంటాం.
అన్నీ జరుగుతాయా.. ఏంటీ.? అన్నట్లుగా, అనూ ఇమ్మాన్యుయేల్ కెరీర్‌లోనూ అనుకున్నదాని కన్నా అత్యంత భిన్నంగా జరిగింది. అంతవరకూ బిల్డ్ చేసుకున్న కెరీర్‌కి గండి పడిపోయింది. ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేంజ్ కాస్తా, జూనియర్ హీరోయిన్ స్థాయికి కూడా సరి తూగని స్థితికి చేరుకుంది. ఆలా రేస్ లో వెనుకబడిపోయింది. ఐనా సరే, ఎలాగైనా కెరీర్‌లో నిలదొక్కుకోవాలన్న కసి మాత్రం అనూలో ఇప్పటికీ పోలేదు. ఏ చిన్న అవకాశాన్నీ వదలకూడదని డిసైడ్ అయ్యింది.
ఇటీవల బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా ఎంపికైంది. దీంతో పాటు, లేటెస్ట్‌గా నిఖిల్ సినిమాలో అనూకి ఛాన్స్ దక్కిందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే, అనూ ఇమ్మాన్యుయేల్ కెరీర్ మళ్లీ గాడిన పడే అవకాశాలు కనిపిస్తున్నట్లే ఉన్నాయి. ఈ రోజు ఈ ముద్దుగుమ్మ బర్త్‌డే. ఈ ఏడాది అనూ పాప కెరీర్‌లో మంచి మంచి మొలకలు రావాలని ఆశిస్తూ, ఆమెకి బర్త్‌డే విషెస్ చెప్పేద్దామా. విష్ యూ హ్యాపీ బర్త్‌డే అనూ ఇమ్మాన్యుయేల్.