తారక్‌ తన కంటెస్టెంట్‌కి భలే ఛాన్సిచ్చాడే.!

మరిన్ని వార్తలు

తెలుగు బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌ కంటెస్టెంట్‌ ఆదర్శ్‌ గుర్తున్నాడు కదా. వన్‌ ఆఫ్‌ ది స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ ఆఫ్‌ ది బిగ్‌బాస్‌ సీజన్‌ 1. అప్పటికే ఈయన పలు సినిమాల్లో నటించాడు. విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తన సత్తా చాటాడు. అయితే సినిమాల్లో క్యారెక్టర్స్‌తో కన్నా, 'బిగ్‌బాస్‌' షోతోనే ఈయన బాగా పాపులర్‌ అయ్యాడు. అయితే ఇప్పుడు ఈ ఆదర్శ్‌ ఆప్పటి బిగ్‌బాస్‌ హోస్ట్‌ ఎన్టీఆర్‌తో కలిసి సినిమా చేస్తున్నాడు.

 

ఎన్టీఆర్‌ ప్రస్తుతం 'అరవింద సమేత' చిత్రంలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హారికా హాసినీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో తాను ఓ గెస్ట్‌రోల్‌లో నటిస్తున్నాననీ, చిన్న క్యారెక్టర్‌ అయినా, ఎన్టీఆర్‌తో కలిసి నటించినందుకు చాలా ఆనందంగా ఉందంటూ, ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌తో కలిసి దిగిన ఫోటోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు ఆదర్శ్‌. గెడ్డంతో డిఫరెంట్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు ఈ ఫోటోలో ఆదర్శ్‌. 

ఇకపోతే ఈ సినిమాని దసరా కానుకగా 'అరవింద సమేత' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగమ్మాయి ఈషా రెబ్బ ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తోంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. అందుకోసం ఎన్టీఆర్‌ రాయలసీమ యాసలో డైలాగులు ప్రాక్టీస్‌ చేశారు. 

ప్రస్తుతం హైద్రాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటోన్న 'అరవింద సమేత' టీమ్‌, త్వరలోనే ఇక్కడి షెడ్యూల్‌ కంప్లీట్‌ చేసుకుని పొలాచ్చికి షిఫ్ట్‌ అవనుంది. తమన్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS