ఈ వారం ఏకంగా మూడు చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకి రావడంతో సినీ అభిమానులకి ఈ వారం మొత్తం చాలా ఆప్షన్స్ ఉండే అవకాశం ఏర్పడింది.
అయితే ఈ మూడు చిత్రాలలో ఏఏ చిత్రం ప్రేక్షకులని ఎలా ఆకట్టుకున్నదో ఇప్పుడు ఒకసారి సమీక్షిద్దాం.. ముందుగా హీరో రాహుల్ దర్శకుడిగా మారి స్వయంగా రచించిన చిత్రం చి.ల.సౌ గురించి మాట్లాడుకుందాం. హీరోగా ఉన్న వారు దర్శకత్వంలోకి రావడం ఒకరకంగా రిస్క్ అయినప్పటికి ఎప్పటికైనా దర్శకుడిని కావాలనే కోరికతో చి.ల.సౌ తీశాడు.
ఇక సినిమా విషయానికి వస్తే, చి.ల.సౌ సినిమా కథ చాలా సామాన్యంగా ఉంది, నటీనటులు కూడా తమ తమ సహజమైన నటనతో అందరిని ఆకట్టుకున్నారు. మన చుట్టూ జరిగే సంఘటనల నుండే కథని ఎంచుకోవడం దానిని అందరికి అర్ధమయ్యేలా చక్కగా చెప్పడంలో రాహుల్ రవీంద్రన్ విజయం సాధించాడు. ఈయనకి తమ నటనతో సుశాంత్, రుహాణీలు సినిమాకి ప్రాణం పోశారు అనే చెప్పొచ్చు. ఈ సినిమా ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటున్నది.
ఈ లిస్టు లో రెండవ చిత్రం- బ్రాండ్ బాబు. మారుతీ కథ, మాటలు అందించిన ఈ చిత్రంలో హీరోకి బ్రాండ్ పిచ్చి, అలాంటి హీరోకి ఒక పేదింటి అమ్మాయికి మధ్య ప్రేమ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ ఉంది. అయితే ఈ సినిమా తెరకెక్కించే తీరులో కాస్త తడబాటు ఉండడంతో ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేదు అన్న టాక్ వినిపిస్తుంది.
అయితే కామెడీతో పాటు ఇంటరెస్టింగ్ పాయింట్ తో కూడిన సినిమా కాబట్టి తొలిరోజు ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి ఆదరనే దక్కింది. మరి రెండవ రోజు నుండి ప్రేక్షకుల పైనే ఈ చిత్రం భవిష్యత్తు ఆధారపడి ఉంది అని చెప్పక తప్పదు.
మూడవ చిత్రం- గూఢచారి. ఈ చిత్రం పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ తో ప్రేక్షకులని ముందునుండే సిద్ధం చేసేయగలిగారు. ఇక ఈ చిత్రం గురించి చెప్పాలంటే ఎక్కువ శాతం క్రెడిట్ అడివి శేష్ కే దక్కాలి అని చెప్పొచ్చు. ఈ సినిమాకి కథ ఇవ్వడం దగ్గరి నుండి సినిమాలో ప్రధాన పాత్ర పోషించే వరకు అన్ని పర్ఫెక్ట్ గా చేయగలిగాడు శేష్.
ఆయన తరువాత దర్శకుడు శశికిరణ్ కూడా శేష్ అందించిన కథకి అద్బుతమైన విజువల్ ని ఇవ్వగలిగాడు. ఇటువంటి సీక్రెట్ ఏజెంట్ సినిమాలు తెలుగులో తక్కువే అని చెప్పాలి అట్లాంటిది అలాంటి ఒక కథ తో సినిమా తీసి హిట్ కొట్టడం అంటే నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు.
ఈ సినిమాని ప్రేక్షకులందరూ ముక్తకంఠంతో హిట్ అని చెబుతుండడం విశేషం.చివరగా ఇది ఈ తరం తెలుగులో వచ్చిన బాండ్ చిత్రంగా మిగిలిపోతుంది అని కచ్చితంగా చెప్పొచ్చు.
ఇది ఈ వారం www.iQlikmovies.com టాక్ అఫ్ ది వీక్.