హీరో హీరోయిన్లు తెరపై ప్రేమించుకోవడం సహజం. నిజ జీవితంలోనూ ప్రేమలో పడడం.. విచిత్రం. నాగచైతన్య - సమంతలు అలానే నిజ జీవితంలోనూ గాఢంగా ప్రేమించుకుని - పెళ్లి చేసుకుని రియల్ లైఫ్ లోనూ హీరో హీరోయిన్లు అయిపోయారు. అలాంటి ప్రేమకథ చిత్రసీమలో మరోటి నడుస్తోందని తెలుస్తోంది. అయితే ఇది తెలుగు లవ్ స్టోరీ కాదు. తమిళ సినిమా లవ్ స్టోరీ.
యువ కథానాయకుడు ఆది పినిశెట్టి లవ్ లో పడ్డాడట. ఓ హీరోయిన్ ని ప్రేమిస్తన్నాడట. ఆ హీరోయిన్ తో సహజీవనం కూడా చేస్తున్నాడట. ఆకథానాయిక ఎవరో కాదు.. నిక్కీ గల్రాని. వీరిద్దరూ కలిసి `మరకతమణి` చిత్రంలో నటించారు. అప్పటి నుంచీ ఇద్దరి మధ్య స్నేహం కుదిరిందట. అది ఇప్పుడు ప్రేమగా మారిందని టాక్. ఇటీవల ఆది పినిశెట్టి పుట్టిన రోజు వేడుకలు చెన్నైలో జరిగాయి. ఈ వేడుకలకు కేవలం ఆది కుటుంబ సభ్యులే పాల్గొన్నారు. ఆ ఫంక్షన్లో నిక్కీ కూడా కనిపించిందట. దాంతో ఈ కథనాలకు మరింత జోరు వచ్చినట్టైంది. మరి ఈ లవ్ స్టోరీ నిజమేనా, కాదా అనేది తెలియాలంటే ఆది - నిక్కీలలో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే.