నితిన్ పెళ్లి కొడుకు కాబోతున్నాడు. తన బ్యాచిలర్ జీవితానికి వీడ్కోలు పలకబోతున్నాడు. షాలినితో ప్రేమలో పడ్డ నితిన్.. పెద్దల అనుమతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఏప్రిల్ లోనే నితిన్ పెళ్లి జరగాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యాడు, ఈ నెల 22 నుంచి పెళ్లి హంగామా ప్రారంభం కాబోతోంది. 22న ఎంగేజ్మెంట్చ జరగబోతోంది. మరుసటి రోజు.. అంటే 23న మెహందీ ఫంక్షన్ వుంటుందని, 24న ప్రీ మ్యారేజ్ ఫంక్షన్ ఏర్పాటు చేస్తామని, ఈనెల 26 రాత్రి 8:30 గంటలకు వివాహం జరరగోతోంది.
వివాహ వేడుక ఎక్కడ అనే విషయంలో స్పష్టత లేదు. సికింద్రాబాద్లోని ఫలక్ నుమా ప్యాలెస్లో నితిన్ పెళ్లి జరగబోయే ఛాన్సుందని టాక్. లాక్ డౌన్ నిబంధనలు వర్తిస్తున్నాయి కాబట్టి.. పెళ్లికి నితిన్ కి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది.