'అదుగో' బంటీ అదరగొట్టేశావ్‌ కదేటీ.!

మరిన్ని వార్తలు

విలక్షణ చిత్రాలకు పెట్టింది పేరు రవిబాబు. ఏదో తెలియని మ్యాజిక్‌ చేస్తాడు. రెగ్యులర్‌ ఫార్మేట్‌ని అస్సలు నమ్ముకోడు. హిట్‌ గురించి కూడా ఆలోచించడు. తన ఆలోచనా తీరే వేరంటాడు. అందుకే రవిబాబు నుండి సినిమా వస్తుందంటే ప్రత్యేకంగా అభిమానం చూపించేవాళ్లు చాలా మంది ఉంటారు. ఈ సారి పూర్తిగా రవిబాబు పిల్లల్ని టార్గెట్‌ చేసినట్లు అనిపిస్తోంది. 

రాజమౌళి వంటి దర్శక ధీరుడు 'ఈగ'ని కథానాయకుడిగా చేసి సినిమా తీస్తే లేనిది. నేను పందిని కథానాయకుడిగా చేసి సినిమా తీస్తే తప్పేంటి? అనుకున్నాడో ఏమో. ఇంకేం ఆలోచించకుండా వెంటనే తన సినిమా కోసం హీరోగా ఓ పంది పిల్లని పట్టుకొచ్చేశాడు. ఒక్క పందిపిల్లని కాదండోయ్‌. ఒకే రకమైన పందిపిల్లల్ని చాలానే పెంచేశాడట రవిబాబు ఈ సినిమా కోసం. ఈ సినిమా చిత్రీకరణకు దాదాపు రెండేళ్లు టైం తీసుకుంది. మరి పందితో సినిమా అంటే మాటలా చెప్పండి. రాజమౌళి ఈగని గ్రాఫిక్స్‌లో చూపించేసినట్లు అన్ని సీన్లలోనూ పందిని గ్రాఫిక్స్‌లో చూపించేయడం కుదరదు కదా. అందుకే మరి ఏకంగా పందుల పెంపకంలో ముందుగా ట్రైనింగ్‌ తీసుకున్నాడు రవిబాబు.

 

ఇకపోతే ఈ పంది పిల్ల హీరోగా వస్తున్న సినిమా 'అదుగో' ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. సూపర్‌ అన్న మాట తక్కువే. పిల్లలకే కాదు, పెద్దలకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. పంది చేసే ఫైటింగులు, ఛేజింగ్‌లు, డాన్సింగులు అబ్బో చాలా ఉన్నాయిలెండి. అవన్నీ ట్రైలర్‌లో చూపెట్టేస్తే ఎలా? అందుకే మచ్చుకు కొన్ని చూపించారు. సినిమాకొస్తే అన్నీ చూపిస్తామంటున్నారు. దసరా బరిలో రానున్న పెద్ద హీరోలు, చిన్న హీరోలతో పాటు. 

'అదుగో' మన హీరో బంటీగారూ కూడా పరుగెత్తుకొచ్చేస్తున్నారు. కాస్కోండి బాబూ మరి.!

 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS