'2.0' టీజర్‌ సందడి భలేగుందండీ.!

By iQlikMovies - September 12, 2018 - 16:41 PM IST

మరిన్ని వార్తలు

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన '2.0' చిత్రం టీజర్‌ని వినాయక చవితికి విడుదల చేయనున్నారన్న సంగతి తెలిసిందే. 

అయితే ఈ టీజర్‌ విడుదలకు జరుగుతున్న హడావిడి అంతా ఇంతా కాదు. ఓ పెద్ద సినిమా విడుదలకు జరుగుతున్న హడావిడిలా ఉంది. త్రీడీ ఫార్మేట్‌లో ఈ టీజర్‌ని రెడీ చేస్తుండడం విశేషం. అయితే కొన్ని ఎంపిక చేసిన ధియేటర్స్‌లో మాత్రమే ఈ టీజర్‌ని చూసే వీలుంది. ధియేటర్స్‌లో అంటున్నారు టికెట్‌ తీసుకొని వెళ్లాలేమో అనుకునేరు. కాదు కాదు ఫ్రీగానే చూడొచ్చు అయితే ముందుగా రిజిస్టర్‌ చేసుకోవాలి. దీనికోసం కొన్ని ఫోన్‌ నెంబర్లను అందుబాటులో ఉంచారు. 

ఓ టీజర్‌ రిలీజ్‌ కోసం ఈ తరహా ఏర్పాటు ఇండియన్‌ సినిమా హిస్టరీలోనే ఇదే తొలిసారి. ఈ మధ్య రజనీకాంత్‌ నటించిన 'కబాలి', 'కాలా' చిత్రాలు ఆశించిన విజయాల్ని అందుకోలేదు. అయినా కానీ రాబోతున్న '2.0' మూవీకి వస్తున్న హైప్‌ బజ్‌ చూస్తుంటే సూపర్‌స్టార్‌ స్టామినా ఇది అని ఒప్పుకోకుండా ఉండలేకపోతున్నాం. గతంలో దుబాయ్‌లో నిర్వహించిన 'రోబో 2.0' ఆడియో ఫంక్షన్‌ని ఎలా నిర్వహించారో అందరికీ తెలిసిందే. 

కనీ వినీ ఎరుగని రిచ్‌నెస్‌తో ఆడియో ఫంక్షన్‌ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందింది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కి జోడీగా అమీజాక్సన్‌ నటించింది. బాలీవుడ్‌ విలక్షణ నటుడు అక్షయ్‌ కుమార్‌ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఆయన గెటప్‌కి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ ఇటీవల విడుదలైంది. కాకిని పోలిన విచిత్రమైన గెటప్‌లో అక్షయ్‌కుమార్‌ కనిపిస్తున్నారు. నవంబర్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS