ఆదిపురుష్ సీన్స్ లీక్ చేసేశాడే...?!

మరిన్ని వార్తలు

బ‌డా సినిమాల‌కు సంబంధించిన కీల‌క‌మైన విష‌యాల్ని చిత్ర‌బృందం గోప్యంగా ఉంచుతుంటుంది. అందులో ఏ ఒక్క‌టి బ‌య‌ట‌కు వ‌చ్చినా, సినిమా చూస్తున్న‌ప్పుడు ప్రేక్షకులు థ్రిల్ మిస్స‌వుతార‌న్న‌ది వాళ్ల భ‌యం. అయితే... కొంత‌మంది హీరోలు, ఆర్టిస్టులు మాత్రం - ఇంట‌ర్వ్యూల‌లో నోరు జారి కొన్ని విష‌యాల్ని బ‌య‌ట‌కు చెప్పేస్తుంటారు. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ కూడా అదే చేశాడు.

 

ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న పాన్ ఇండియా చిత్రం `ఆదిపురుష్‌`. ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో సైఫ్ అలీఖాన్ ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క‌థ రామాయ‌ణ గాథ నేప‌థ్యంలో సాగుతుంద‌ని ప్ర‌చారం జ‌ర‌గుతోంది. చిత్ర‌బృందం మాత్రం స్ప‌ష్టంగా చెప్ప‌లేదు. కానీ... సైఫ్ మాత్రం `ఇది రామాయ‌ణ‌మే` అని రూఢీ చేసేశాడు. అంతేకాదు.. త‌న పాత్ర గురించిన క్లూ కూడా ఇచ్చేశాడు. ఈ సినిమాలో తాను రావ‌ణ పాత్ర‌ని పోషిస్తున్నాడ‌ని, అయితే రావ‌ణ పాత్ర‌లోని పాజిటీవ్ షేడ్స్ ని ఈ సినిమాలో ద‌ర్శ‌కుడు చూపించ‌బోతున్నాడ‌ని, శూర్ప‌ణ‌క ముక్కుని ల‌క్ష్మ‌ణుడు కోసే స‌న్నివేశంలోనూ... కొన్ని ఉదాత్త‌మైన ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయ‌ని చెప్పేశాడు. సో.. ఇది రామాయ‌ణం అని తేలిపోయిది, రావ‌ణుడి పాత్ర‌ని పూర్తి పాజిటీవ్ కోణంలో ఆవిష్క‌రిస్తున్నార‌న్న విష‌యం అర్థ‌మైంది. సినిమా మొద‌ల‌వ్వ‌క‌ముందే కీల‌క‌మైన విష‌యాలు ఇలా బ‌య‌ట‌పెట్టేస్తే ఎలా? అంటూ సైఫ్ పై చిత్ర‌బృందం చిందులు తొక్కుతోంద‌ని స‌మాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS