శుక్రవారం నుంచి తెలంగాణలో థియేటర్లు తెరచుకున్నాయి. సినిమా సెలబ్రెటీలు సైతం.. థియేటర్లకు వెళ్లి `మీరూ.. రండి..` అంటూ ఆహ్వానాలు అందించారు. అయితే.. ఇక్కడ సమస్యేంటంటే... థియేటర్లు ఉన్నా.. వాళ్లకు ఫీడ్ లేదు. అంటే.. కొత్త సినిమాల్లేవు. పాత సినిమాలే మళ్లీ కొత్తగా ప్రదర్శించాల్సివస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 2 వేలకు పైగానే థియేటర్లున్నాయి. వాటికి సరిపడా... ఫీడ్ కావాలంటే.. కనీసం అరడజను కొత్త సినిమాలు విడుదల కావాలి. కానీ.. నిర్మాతలు అందుకు సాహజం చేయడం లేదు. అందరి దృష్టీ క్రిస్మస్ పైనే ఉంది. అప్పటి నుంచే కొత్త సినిమాలు వచ్చే అవకాశం ఉంది. ఈలోగా... ఆడిన సినిమాలే మళ్లీ ఆడిస్తున్నారు.
అయితే.. పాత సినిమాలు చూడ్డానికి ప్రేక్షకులు మొగ్గు చూపించరు. మీడియం రేంజు హీరో సినిమా వస్తే తప్ప... జనాలు థియేటర్లకు రారు. ఈ క్రిస్మస్ న `సోలో బతుకే సో బెటరు` వస్తోంది. సాయిధరమ్ తేజ్ నటించిన సినిమా ఇది. కాబట్టి.. జనాల ఫ్లోటింగ్ ఏ రేంజులో ఉందో తెలుసుకోవడానికి ఈ సినిమా ఉపయోగపడుతుంది. ఈ సినిమా బాగా ఆడిందంటే.. అప్పుడు మిగిలిన నిర్మాతలు ధైర్యం చేస్తారు. ఈలోగా థియేటర్లు తెరిచినా లాభం లేదు. ఇటీవల ఓటీటీలో విడుదలైన కలర్ ఫొటో, ఉమా మహేశ్వర ఉగ్ర రూపశ్య లాంటి సినిమాల్నైనా థియేటర్లో విడుదల చేస్తే బాగుంటుందన్నది డిస్టిబ్యూటర్ల ఆలోచన. త్వరలోనే ఈ సినిమాల్ని ఆంధ్ర, తెలంగాణలలో విడుదల చేసే అవకాశం ఉంది.