రాధే శ్యామ్ తరవాత.. ప్రభాస్ వరుసగా రెండు సినిమాలతో బిజీ కానున్నాడు. అందులో ఆదిపురుష్ ఒకటి. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. టీ సిరీస్ నిర్మిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ లంకేశ్ గా కనిపించనున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో కేవలం వీఎఫ్ఎక్స్ కోసమే రూ.200 కోట్లు పెట్టనున్నారట. హాలీవుడ్ స్టూడియోస్ వీఎఫ్ఎక్స్ పనులను పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తుంది.
జనవరి 19 నుంచి ఆదిపురుష్ సెట్స్ పైకి వెళ్తోంది. ముంబైలోని ఓ స్టూడియోలో చిత్ర షూటింగ్ ప్రారంభించడమే కాదు సినిమా మొత్తాన్ని అదే స్టూడియోలో చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా, కృతి సనన్ సీత పాత్రలో కనిపించనున్నట్టు టాక్. `సలార్` షూటింగ్ నీ... ఈ నెలలోనే ప్రారంభిస్తారు. ఆ డేట్ ఫిక్స్ కావాల్సివుంది.