తొలి సినిమా ఇంకా విడుదలవలేదు.. కానీ, చేతిలో మూడు నాలుగు తెలుగు సినిమాలున్నాయ్. ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి గురించే ఇదంతా. ఈ బెంగళూరు బ్యూటీ, తొలి తెలుగు సినిమా విడుదల కాకుండానే ఎడా పెడా ఛాన్సులు కొట్టేస్తోంది తెలుగు సినీ పరిశ్రమలో. నేచురల్ స్మైల్ ఈ బ్యూటీకి పెద్ద ప్లస్ పాయింట్. తొలి తెలుగు సినిమా విడుదల కాకుండానే ఇంత ఫాలోయింగ్ ఏంటి.? అని ప్రశ్నిస్తే, అదంతా తన అదృష్టమేనని ఈ బ్యూటీ చెబుతోంది.
‘ఉప్పెన’ తనకు వెరీ వెరీ స్పెషల్ ఫిలిం అనీ, షూటింగ్ అనుభవాల గురించి చెప్పాలంటే అదో పెద్ద పుస్తకమే అవుతుందనీ కృతి శెట్టి చెప్పుకొచ్చింది. కాగా, కృతి శెట్టిని మరో బంపర్ ఆఫర్ వరించిందనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. ఓ స్టార్ హీరోయిన్ వదిలేసుకున్న ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఇప్పుడు కృతి చేతిలో పడిందన్నది తాజా గాసిప్స్ సారాంశం. ఆ సినిమా ఏంటి.? ఆ సినిమాలో హీరో ఎవరు.? ఇంతకీ, అంత పెద్ద ఛాన్స్ వదిలేసుకున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరు.? అన్న విషయాలపై స్పష్టత రావాల్సి వుంది.
తెలుగుతోపాటు, కన్నడ అలాగే తమిళ సినీ పరిశ్రమ నుంచీ అవకాశాలు వస్తున్నాయట ఈ బెంగళూరు బ్యూటీకి. ‘ఉప్పెన’ సినిమా విషయానికొస్తే, ఈ సినిమాతో మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.