ప్రభాస్ కథానాయకుడిగా రామాయణాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ‘ఆదిపురుష్’ . ఓం రౌ దర్శకుడు. ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 2న విడుదల చేశారు. అయితే ఈ టీజర్ కి దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. వీఎఫ్ఎక్స్ వర్క్ లో టీజర్ తేలిపోయింది. టీజర్ లో వీఎఫ్ఎక్స్ , సీజీ వర్క్ ఆశించిన స్థాయిలో లేదు. ఎక్కడ కూడా సహజత్వం లేకుండా.. ఒక కార్టూన్ మూవీల వుందని సోషల్ మీడియా వేదికగా చర్చ నడుస్తుంది.
అలాగే ఈ సినిమాకి పని చేసిన ఎన్వై వీఎఫ్‌ఎక్స్‌వాలా కంపెనీని కూడా విమర్శలు వెళ్ళువెత్తాయి. ఐతే ఈ సినిమాకి తాము పని చేయలేదని సదరు నిర్మాణ సంస్థ వివరణ ఇచ్చింది. సినిమాతో తమకెలాంటి సంబంధం లేదని ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థ ఎన్వై వీఎఫ్‌ఎక్స్‌వాలా ప్రకటన విడుదల చేసింది. ''ఎన్వై వీఎఫ్‌ఎక్స్‌వాలా సంస్థ ‘ఆదిపురుష్’ వర్క్‌లో భాగం కాలేదు. ఈ సినిమాకు సంబంధించిన సీజీ లేదా ఏ ఇతర స్పెషల్ ఎఫెక్ట్స్‌ను మేము చేయలేదు’’ అని ప్రకటించుకుంది.