తెలుగులో 'అర్జున్‌రెడ్డి' చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ ఎఫెక్ట్‌తో ఈ సినిమాని హిందీ, తమిళ భాషల్లోనూ రూపొందించే ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఆ క్రమలో హిందీ అర్జున్‌రెడ్డి 'కబీర్‌సింగ్' చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్‌కి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో షాహిద్‌కపూర్, కియారా అద్వానీ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒరిజినల్ డైరెక్టర్ ఈ సినిమాతో బాలీవుడ్‌కి పరిచయమవుతున్నాడు. ఎలాంటి అడ్డంకులు, చిక్కులూ లేకుండా, హిందీ అర్జున్‌రెడ్డి నిర్మాణం పూర్తి చేసుకుని రిలీజ్‌కి రెడీ అయిపోయింది. కానీ, తమిళ అర్జున్‌రెడ్డి మాత్రం పురిటి నొప్పులే అనుభవించింది.
సీనియర్ డైరెక్టర్ బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చివరి దశకు చేరుకున్న తరుణంలో అవుట్ పుట్ నచ్చలేదని డైరెక్టర్ చేయి మారి, మళ్లీ మొదటి నుండీ షూటింగ్ జరుపుకుంది. కొత్త దర్శకుడు గిరిశయ్య ఈ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. తమిళ అగ్రహీరో విక్రమ్ పుత్రరత్నం ధృవ్ హీరోగా పరిచయమవుతున్నాడు. 'ఆదిత్య వర్మ' టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. బనితా సందు హీరోయిన్‌గా పరిచయమవుతోంది. అవుట్ పుట్ ఈ సారి చాలా చాలా బాగా వచ్చిందట. చిత్రయూనిట్ పక్కా కాన్ఫిడెంట్‌గా ఉందంటున్నారు. దాంతో ఇక సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట. అలా ఎట్టకేలకు అన్ని కష్టాలు ఓర్చి 'ఆదిత్య వర్మ' విడుదలకు సిద్ధమైంది. ఇన్ని కష్ట నష్టాలను భరించిన ఈ సినిమా, ప్రేక్షకుల ఆదరణ పొందుతుందా.? లేదా.? తెలియాలంటే ఇంకొద్ది సమయం వెయిట్ చేయాలి. త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు కానీ ఇంకా డేట్ కన్‌ఫామ్ చేసుకోలేదు 'ఆదిత్య వర్మ'.