శర్వానంద్ కథానాయకుడిగా నటించే చిత్రం `మహా సముద్రం`. ఆర్.ఎక్స్ 100తో ఆకట్టుకున్న అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మరో కీలకమైన పాత్ర కోసం సిద్దార్థ్ ని ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కథానాయిక కూడా ఖాయం అయిపోయింది. అతిథిరావు హైదరీని కథానాయికగా ఎంచుకున్నారు. `మహా` సముద్రంలో.. మహా అంటే ఇక నుంచి తనే. మహా అనే అమ్మాయి కథ ఇది. విశాఖ తీరం నేపథ్యంలో సాగుతుంది. అందుకే ఈ సినిమాకి ఆ పేరు పెట్టారు.
ఈ సినిమా కోసం చాలా మంది కథానాయికల పేర్లు పరిశీలించారు. చివరికి అతిథిని ఖరారు చేశారు. కథానాయిక పాత్రలో నటనకు ప్రాధాన్యం ఉందని, అందుకే అతిథిని తీసుకున్నామని చిత్రబృందం చెబుతోంది. 2021లో ఈ సినిమా పట్టాలెక్కబోతోంది.