నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వి’. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటిస్తుండగా, నాని వెర్సటైల్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు. ఇదంతా తెలిసిన సంగతే. ఇద్దరు హీరోలున్నారు కదా.. హీరోయిన్స్ కూడా ఇద్దరే ఉన్నారులెండి. ఒకరు నివేదా థామస్ కాగా, మరో భామ అదితీ రావ్ హైదరీ. రిలీజ్ డేట్ నేపథ్యంలో చిత్ర యూనిట్ కొన్ని ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది. సాంగ్ ప్రోమోస్ వదలడం, కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేయడం.. ఇలాంటివి బాగానే చేసింది. అయితే, ఇంతవరకూ రిలీజ్ చేసిన ప్రోమోస్‌లో ఎక్కడా అదితీ రావ్ హైదరి కనిపించలేదు.
‘వస్తున్నా వచ్చేస్తున్నా..’ అనే ఓ సాంగ్, ‘మనసు మరీ మత్తులో ఊగిపోతున్నదే..’ అంటూ సాగే రెండు ఆడియో సింగిల్స్ రిలీజ్ చేశారు. ఈ రెండు సాంగ్ ప్రోమోస్‌లోనూ నివేదా థామసే కనిపిస్తోంది. అదితీ రావ్ క్యారెక్టర్‌కి సంబంధించి ఓ ఫస్ట్‌లుక్ కూడా రివీల్ కాలేదింతవరకూ. ఆమె పాత్రను ఎందుకు సస్పెన్స్‌గా ఉంచారు.? ఇంతకీ అదితి ఎవరితో జోడీ కడుతోంది.? ‘వస్తున్నా వచ్చేస్తున్నా..’ సాంగ్‌లో సుధీర్ బాబుకీ, నివేదా థామస్‌కీ మధ్య రొమాంటిక్ ట్రాక్ చూపిస్తున్నారు. అంటే, అదితి, నానితో జత కట్టబోతోందా.? అసలింతకీ ఆమె పాత్రేంటి.? తెలియాలంటే వెయిట్ చేయాలి బాస్.