‘వన్ ` నేనొక్కడినే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కృతిసనన్ పెద్దగా స్టార్‌డమ్ దక్కించుకోలేకపోయింది. మహేష్ సినిమా తర్వాత నాగచైతన్యతో ఓ సినిమాలో నటించింది. కానీ, రెండు సినిమాల రిజల్ట్‌లూ ఈ పొడుగు కాళ్ల సుందరికి ఆశించిన విధంగా కలిసి రాలేదు. దాంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడా మొదట్లో కెరీర్‌ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడిరది కృతిసనన్. కానీ, ‘లొక్కా చుప్పి’ సినిమాతో కృతిసనన్ దశ తిరిగిపోయింది. ఈ సినిమాతో తొలిసారి హిట్ టేస్ట్ చవి చూసిన కృతిసనన్, ఆ పై ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.
‘హౌస్ ఫుల్ 4’ తదితర సినిమాలతో వరుస హిట్లు, వరుస ఛాన్సెస్ దక్కించుకుంటూ జోరుగా కెరీర్‌ని నడిపించేస్తోంది. ఇక ప్రస్తుతం ఆమె నటించిన ‘మిమి’ చిత్రం రీసెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. రియలిస్టిక్ స్టోరీ బేస్ చేసుకుని రూపొందిన ఈ చిత్రంలో కృతిసనన్ సరోగసీ మదర్‌గా కనిపించనుంది. ఈ పాత్ర కోసం ఏకంగా 15 కేజీల బరువు పెరిగిందట. ఆ పెరిగిన బరువును తగ్గించుకునేందుకు ఇప్పుడు చాలా కష్టపడుతోందట. స్పెషల్ డైట్‌ని ఫాలో చేస్తోందట. ఇంతవరకూ డైట్ జోలికి వెళ్లని కృతి, తన ఫిజిక్‌ని ఇదివరకటి షేప్‌లోకి తెచ్చుకునేందుకు తొలిసారి డైటింగ్ చేయాల్సి వస్తోందనీ, అందుకోసం తనకి ఎంతో ఇష్టమైన కొన్ని ఫుడ్ ఐటెమ్స్‌ని మానేయాల్సి వస్తోందనీ చెబుతోంది. ప్రస్తుతం కృతిసనన్, అక్షయ్‌కుమార్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది.