ఆకట్టుకునే కొత్తందం కొత్త కొత్తగా

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ అదితీ రావ్‌ హైదరీ అచ్చమైన హైద్రాబాదీ అమ్మాయి. కానీ బాలీవుడ్‌లో సెటిలైపోయింది. అక్కడ పలు సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటించింది. తెలుగులో ఇప్పుడిప్పుడే అవకాశాలు అంది పుచ్చుకుంటోన్న ఈ బ్యూటీ, సుధీర్‌బాబు హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమాలో నటిస్తోన్న సంగతి తెల్సిందే. తాజాగా వోగ్‌ మ్యాగజైన్‌ కవర్‌ పేజీ మీద ఇలా హాట్‌ హాట్‌గా వయ్యారాల్ని ఒలకబోసేసింది. ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ని ఫాలో అవడం కాదు, ట్రెండ్‌ సెట్‌ చేసే రకం నేను.. అంటూ ఫ్యాషన్‌ రంగంపై తనకున్న అవగాహనను, అభిరుచినీ చాటుకుంది అదితి రావు హైదరీ. ఎప్పుడూ వివాదాల జోలికి తాను వెళ్ళననీ, తనను వివాదాల్లోకి తనను ఎవరన్నా లాగితే ఊరుకునేది లేదని చెప్పే అదితి రావు హైదరీ, వీలైనంతవరకు హ్యాపీగా వుండడమే తన గ్లామర్‌ సీక్రెట్‌ అని చెప్పింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS