'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలో సీనియర్ నటుడు అర్జున్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆ పాత్ర కోసం ఆయన్నే ఎందుకు ఎంచుకున్నారనేది సినిమా చూస్తే అర్ధమువుతందట. ఒకప్పుడు హీరోగా తానేంటో చూపించిన అర్జున్ ఇప్పుడు యంగ్ హీరోస్‌తో కలిసి నటించడం కొత్తేమీ కాదు.
గతంలో నితిన్‌తో కలిసి 'శ్రీ ఆంజనేయం' సినిమాలో నటించాడు. ఆంజనేయ స్వామిలా అర్జున్ నటన విశేషంగా ఆకట్టుకుంటుంది ఆ సినిమాలో. అలాగే మరో యంగ్ హీరో రామ్‌తో 'రామరామ కృష్ణకృష్ణ' సినిమాలో నటించాడు. ఆ సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గానూ, పల్లెటూరి పెద్దగానూ రెండు వేరియేషన్స్‌లో అద్భుతమైన నటన కనబరిచాడు. కానీ ఈ రెండు సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. లేటెస్టుగా నితిన్‌తో మరోసారి 'లై' సినిమాలో నటించాడు. కానీ ఈ సినిమా ఘోర పరాజయం పొందింది.
అర్జున్ మంచి నటుడు. ఆయన్ని సరిగ్గా వాడలేకపోతున్నారనే విమర్శలున్నాయి. తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోగా ఎన్నో సూపర్‌హిట్స్ అందుకున్నాడు. అలాంటి అర్జున్ టాలెంట్‌ని సక్రమంగా ఉపయోగిస్తే, సినిమాకి ఆయన పాత్ర అత్యంత హైప్‌ని క్రియేట్ చేస్తుందనడం నిస్సందేహం. అయితే తాజా చిత్రం 'సూర్య'లో అర్జున్ చాలా టిపికల్ అండ్ వర్సిటైల్ క్యారెక్టర్ ని పోషించాడట. ఈ క్యారెక్టర్ అందరికీ చాలా బాగా నచ్చుతుందని డిఫరెంట్‌గా ఆకట్టుకుంటుందనీ చిత్ర యూనిట్ చెబుతోంది. మే 4న 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు.