'రన్ రాజా రన్' చిత్రంలో హీరో శర్వాకి స్నేహితుడి పాత్రలో ఇంపార్టెంట్ రోల్ పోషించాడు. అలాగే 'పంజా' సినిమాలో పవన్ కళ్యాన్‌తో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. ఇలా సపోర్టింగ్ రోల్స్‌లోనే కాదు, విలన్ పాత్రకైనా ఇట్టే సూటైపోయే పర్సనాలిటీ అడవి శేష్‌ది. సమ్‌థింగ్ స్పెషల్ యాక్టర్ అడవి శేష్. కేవలం నటన మాత్రమే కాదు, మనోడిలో చాలా టాలెంట్స్ ఉన్నాయి కూడా. సోలో హీరోగా 'క్షణం' సినిమాతో తన సత్తా చాటాడు. యాక్టింగ్ టాలెంటే కాదు, తెలివితేటలు కూడా చాలా ఎక్కువే మనోడికి.
తనను తాను బెటర్ హీరోగా ప్రమోట్ చేసుకునేందుకు తాపత్రయం పడుతున్నాడు. తాజాగా అడవిశేష్ 'గూఢచారి' అనే చిత్రంలో నటిస్తున్నాడు. శశి కిరణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే కథ, స్క్రీన్‌ప్లే మాత్రం అడవి శేష్‌వే. ఇదో స్పై థ్రిల్లర్ నేపథ్యమున్న సినిమా. టెక్నికల్‌గా చాలా డిఫరెంట్‌గా ఉండబోతోందట. కొత్త టెక్నాలజీని తెలుగు ఆడియన్స్‌కి పరిచయం చేయబోతున్నాడు అడవి శేష్. ఇంతవరకూ అమెరికా, ఢిల్లీ, చిట్టగాంగ్, వైజాగ్, కాకినాడల్లో కొన్ని లొకేషన్స్‌లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్‌కి షిఫ్ట్ అవ్వబోతోంది.
ఇక్కడి మంచు కొండల్లో చివరి షెడ్యూల్ పూర్తి చేసుకోనుంది. ఈ చిత్రంలో అడవి శేష్ స్పైగా కనిపించబోతున్నాడు. శోభిత హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ డిఫరెంట్ ప్రయోగాత్మక చిత్రంతో మన అడవిశేష్ 'క్షణం' మాదిరిగా మరో హిట్‌ని ఎలాగైనా తన ఖాతాలో వేసుకునేందుకు తాపత్రయపడుతున్నాడు. చూడాలి మరి ఏం చేస్తాడో.!