మన హీరోలు తమ సినిమాల గురించే కాకుండా, అప్పుడప్పుడూ సామాజిక అంశాల పైనా, రాజకీయ పరమైన ఇష్యూల పైనా స్పందిస్తూ, తమ తమ అభిప్రాయాలు తెలియపరుస్తున్నారు. అందులో భాగంగానే, యంగ్ హీరో నిఖిల్ గతంలో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ విషయమై స్పందించాడు. సోషల్ మీడియాలో స్పెషల్ స్టేటస్ ఇష్యూపై నిఖిల్ స్పందించిన తీరు అప్పట్లో వైరల్ అయ్యింది. లేటెస్టుగా కర్ణాటక ఎలక్షన్స్ ఫలితంపై మళ్లీ స్పందించాడు నిఖిల్. నిఖిల్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది.
సోషల్ మీడియాలో మోడీకి అమిత్‌షాకి కంగ్రాట్స్ చెబుతూ, కన్నడ ప్రజల తీర్పును గౌరవించాలని నిఖిల్ అభిప్రాయపడ్డాడు. అయితే ఇదే ట్వీట్‌లో మోడీ మెజీషియన్‌లా కనిపిస్తున్నాడనీ నిఖిల్ పేర్కొనడం సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా, పెట్రోల్ ధరలు, డీమానిటైజేషన్, జీఎస్‌టీ లాంటి వన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. కర్ణాటకలో ఎక్కువగా ఉండే, తెలుగు ప్రజలు కూడా బీజేపీనే గెలిపించారనీ నిఖిల్ అన్నారు. దాంతో నిఖిల్‌ని తిడుతూ సోషల్ మీడియాలో బీజేపీ అభిమానులు రీ పోస్టులు పెడుతున్నారు.
కర్ణాటక ఎలక్షన్స్ ఫలితంపై దేశమంతటా ఆశక్తి నెలకొంది. కర్ణాటక ప్రజలు మార్పును ఆహ్వానిస్తారని ఆశించారు. కానీ అలా జరగలేదు. దాదాపు బీజేపీనే అక్కడ విజయం సాధించేలా ఉంది. దాంతో ఊహలు తారుమారయ్యాయి. మళ్లీ బీజేపీకే కర్ణాటక జనం పట్టం కట్టబోతున్నారని తేలిపోతోంది.