ఫ్లాపుల్లో మునిగితేలుతున్న కథానాయికల్లో మెహరీన్ కూడా ఉంటుంది. తన ఖాతాలో హిట్టు పడి చాలా కాలమైంది. అయితే... అవకాశాలు మాత్రం అందుతూనే ఉన్నాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం మానేసి, నిర్మాతలకు చుక్కలు చూపిస్తోంది మెహరీన్. విషయంలోకి వెళ్తే...
ఈమధ్య చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ కథానాయకుడిగా ఓ చిత్రం మొదలైంది. పులివాసు ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం కోసం మెహరీన్ని కథానాయికగా ఎంచుకున్నారు. అందుకోసం రూ.30 లక్షల పారితోషికానికి ఎగ్రిమెంట్ జరిగింది. రూ.10 లక్షల అడ్వాన్సు కూడా ఇచ్చారు. ఇప్పుడు మెహరీన్ ఈ సినిమా చేయనంటోందట. అడ్వాన్సు కూడా తిరిగి ఇవ్వనని చెబుతోందట. ముందు ఓ హీరోని అనుకున్నారని, ఆ తరవాత హీరోని మార్చారని అందుకే ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నానని మెహరీన్ చెప్పింది.
అయితే అడ్వాన్సు మాత్రం ఇవ్వనంటోంది. నిర్మాతల వెర్షన్ మరోలా ఉంది. హీరో ఎవరైనా సరే, మెహరీన్ సినిమా చేయాల్సిందేనని, కావాలంటే పారితోషికం ఇంకొంత పెంచుతామని, కుదరనిపక్షంలో అడ్వాన్సు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ గొడవ ఎలా సద్దుమణుగుతుందో.