కథానాయకులపై అభిమానులకు ఉండే ప్రేమ... ఎల్లలు లేనిది. వయసుతోనూసంబంధం లేదు. 106 ఏళ్ల వృద్ధురాలు.. మహేష్‌పై పెంచుకున్న అభిమానం చూశాం కదా? మహేష్ కూడా తన అభిమానిని కలిసి - ఆమె ఆనందానికి అవధుల్లేకుండా చేశారు. నూట ఆరేళ్ల రేలంగి సత్యవతి మహేష్ కోసం రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చి, మహేష్‌ని కలుసుకుంది. ఆ ఫొటోని మహేష్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో బాగా వైరల్ అయిపోయింది. ఈ ఫొటో చూసి చాలామంది సెలబ్రెటీలు స్పందిస్తున్నారు. అక్కినేని మనవడు సుమంత్ కూడా.. 'మా తాతయ్యకీ నువ్వంటే ఇష్టమే' అంటూ ట్వీట్ చేశాడు.
ఇప్పుడు ఆ ట్వీట్‌కి మహేష్ కూడా బదులిచ్చాడు. ''థ్యాంక్యూ సుమంత్. ఏఎన్నార్ గారు నాక్కూడా ఎన్నో విధాలుగా ఆదర్శప్రాయులే'' అంటూ స్పందించాడు. టాలీవుడ్లో మహేష్ ఫ్యాన్స్‌కి కొదవలేదు. ఇక్కడ అడుగు పెట్టిన ప్రతీ కథానాయిక 'నాకు మహేష్ అంటే ఇష్టం' అనే చెబుతుంది. సెలబ్రెటీలలోనూ మహేష్‌కి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. 'మహేష్ అందగాడు' అంటూ నాగార్జున, ఎన్టీఆర్, చిరంజీవిలే కాంప్లిమెంట్ ఇచ్చారు. అందుకే తనకి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్.