మ‌ళ్లీ 'డాన్' అవ‌తారం ఎత్తుతున్న ర‌వితేజ‌

By iQlikMovies - December 12, 2018 - 11:24 AM IST

మరిన్ని వార్తలు

డాన్ శీనులో... ర‌వితేజ డాన్ పాత్ర‌లో క‌నిపించాడు. మ‌రోసారి డాన్‌గా వినోదాలు పంచ‌డానికి రెడీ అవుతున్నాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా వి.ఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ర‌వితేజ రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నాడు. అందులో ఒక‌టి డాన్‌. ఇది తండ్రీ కొడుకుల క‌థ‌. తండ్రి పాత్ర డాన్ నేప‌థ్యంలో సాగుతుంద‌ని స‌మాచారం.

 

1980ల నాటి క‌థ ఇది. అప్ప‌టి డాన్‌లు ఎలా ఉండేవారో... ఈ సినిమాలో చూపించ‌బోతున్నార‌ని స‌మాచారం. ఈపాటికే చిత్రీక‌ర‌ణ కూడా మొద‌ల‌వ్వాల్సింది. కానీ... ఈ సినిమాకి అవ‌స‌ర‌మైన సెట్ నిర్మాణంలో జాప్యం వ‌ల్ల‌... సినిమా కూడా ఆల‌స్య‌మైంది. ఇప్పుడు సెట్లూ అవీ లేకుండా.

 

రియ‌ల్ లొకేష‌న్ల‌లో ఈ సినిమాని చిత్రీక‌రించాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నారు. జ‌న‌వ‌రి మొద‌టి వారంలో ముంబై లేదా గోవా ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ మొద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ చిత్రానికి 'డిస్కోరాజా' అనే పేరు ప‌రిశీలిస్తున్నారు


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS